Hansika fire on marfing of her photos and videos

hansika motwani news, hansika motwani interview, hansika motwani hot photos, hansika motwani gallery, hansika motwani photo shoot, hansika motwani photo shoot

actress hansika fire on marfing of her photos and videos. she said that marphing is worst than rape

మార్ఫింగ్ రేప్ కన్నా నీచం: హీరోయిన్ హన్సిక

Posted: 03/07/2015 07:47 PM IST
Hansika fire on marfing of her photos and videos

టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఎంత్ర ప్రయోజనం ఉందో, దాన్ని వక్రంగా వాడితే అంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. సెలబ్రెటీలపై చాలా మంది తమ టుక్నాలజీ నైపుణ్యాలను చూపిస్తుంటారు. అలా మార్పింగ్ చెయ్యడం ద్వారా సెలబ్రెటీలకు, వారి కుటుంబ సభ్యులకు కొంత బాధను కలిగిస్తున్నారు. అయితే మార్ఫింగ్ చేసిన ఓ వీడియోపై హన్సిక తీవ్రంగా మండిపడుతోంది. పాపం ముద్దుగుమ్మ ఎందుకంతలా మండిపండిందని అనుకుంటున్నారా, తాజాగా విడుదలైన ఓ వీడియోలో హన్సిక మొహాన్ని మార్ఫింగ్ చేశారు. మార్ఫింగ్ చేయడం లాంటి నీచమైన పనులకు కొందరు ఎందుకు ఒడిగడ్తారో అర్థం కావట్లేదన్నారు. మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను వ్యాప్తి చేయడం రేప్ కంటే నీచమైనదంటూ హన్సిక మండిపడుతోంది. అశ్లీల చిత్రాలు పోస్టు చేయడం, మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేయడం లాంటివి అత్యాచారం కంటే నీచం అంటోంది ఈ అమ్మడు.

 హీరోయిన్లు రాయల్ లైఫ్ ను అనుభవిస్తారని కొందరు భావిస్తారనీ, అందులో నిజం లేదని హన్సిక తెలిపింది. ప్రేక్షకులకు వినోదం పంచడానికి తాను 24 గంటలూ కటోరంగా శ్రమిస్తున్నానని మీడియా ముందు వాపోయింది ఈ చిన్నది. మార్ఫింగ్‌పై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించగా ఆ వీడియోలో ఉన్నది తాను కాదనే విషయం అందరికీ తెలిసినపుడు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయాలన్నారు. మొత్తానికి మార్ఫింగ్ గురించి పాలబుగ్గల చిన్నదానికి చిర్రెత్తింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  gangrape  marphing photos  

Other Articles