బడుగుజీవులపై కేంద్ర ప్రభుత్వం కరుణ కురిపించింది. దేశంలో అనేక మంది కడుపేదలు ప్రమాదాల బారిన పడి మరణించడంతో వారి కుటుంబాల వీధిన పడుతున్నాయని, ఇందుకోసం మృతుల కుటీంబికులను ఆర్థిక అదుకునేందుకు సరికొత్త ప్రమాద భీమా పథాకాన్ని ప్రారంభించింది. చాలామందికి ఎలాంటి ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా లేదని, అనేకులకు పింఛను కూడా రావట్లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇందుకోసం త్వరలోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. దీనికింద ఏడాదికి 12 రూపాయల ప్రీమియంతో.. అంటే, నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. అంటే, ఈ ప్రీమియం కట్టినవాళ్లు ఎవరైనా ప్రమాదాల్లో మరణిస్తే, వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షలు అర్థిక సాయం అందనుంది.
ఇక ప్రధానమంత్రి జనధన యోజన కింద అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని, అందులో భాగంగా పింఛను సదుపాయం కూడా ఇస్తామన్నారు. ప్రతినెలా ఈ ఖాతాలో పేదలు ఎంత ఆదా చేస్తే అందులో సగం మళ్లీ ప్రభుత్వం కూడా కలుపుతుందని, 60 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచి వారికి పింఛను వస్తుందని అన్నారు. అలాగే, 18-50 ఏళ్ల మధ్యవారికి ఏడాదికి రూ. 335 ప్రీమియంతో మరో ప్రమాదబీమా కల్పిస్తామన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, వృద్ధుల కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more