Abu salem awarded life sentence

Abu Salem, Pradeeep jain murder, Mumbai city builder Pradeep Jain, Abu Salem cases, Abu Salem murders pradeep jain, Mumbai crime, Abu Salem life sentence, TADA Court., Pradeep Jain murder case, Abu Salem sentenced to life imprisonment, abu salem

gangster Abu Salem sentenced to life imprisonment in builder Pradeep Jain murder case

గ్యాంగ్ స్టర్ అబుసలేంకు జీవితఖైదు

Posted: 02/25/2015 03:04 PM IST
Abu salem awarded life sentence

ఇండియా మోస్ట్ వాంటెండ్ మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులలో ఒకడైన గ్యాంగ్ స్టర్ అబూసలేంకు న్యాయస్థానం జీవిత కారాగార శిక్షను విధించింది. ముంబాయిలోని ప్రత్యేక టాడా కోర్టు ఈ మేరకు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. గ్యాంగ్ స్టర్ అబుసలేంతో పాటు అతని డ్రైవర్ యోహంది హసన్ కూడా ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారగారా శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో మరో నిందితుడు బిల్డర్ అయిన 86 ఏళ్ల వీకే ఝాంబ్ కు కూడా కారాగార శిక్షను విధించింది.

కాగా ఝంబ్ ఇప్పటికే తన కారాగార శిక్షను పూర్తి చేసుకున్న నేపథ్యంలో వీల్ చైర్ పనున్న ఝంబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా వదిలిపెట్టారు. ప్రదీప్ జైన్ అతడి సోదరుడు సునీల్తోపాటు పలువురు బిల్డర్లను సలేం బెదిరించి భయకంపనలు సృష్టించాడని కోర్టు నిర్ధారించింది. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారని కోర్టు పేర్కొంది.

కాగా ప్రదీఫ్ తరపున న్యాయవాదులు అబు సలేం సహా నిందితులందరికీ మరణ శిక్ష విధించాలని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. అయితే మన దేశం నుంచి పారిపోయిన అబుసలేంను పోర్చుగల్ పోలీసులు ముంబాయ్ పోలీసులకు అప్పగించిన క్రమంలో మళ్లీ వారికి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉన్న నేపథ్యంలో మరణశిక్షకు బదులు జీవిత ఖైదు శిక్షను విధించాలని న్యాయవాధి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abu Salem  TADA Court  life sentence  

Other Articles