Hyderabad metro rail will run from next year onwards

hyderabad metro rail will run from next year, metro wont run from ugadi, hyderabad metro rail phase wise launch, no phase wise launch, metro won't run from march, hyderabad metro rail, metro rail runs from Nagole to Mettuguda, Nagole to Mettuguda metro sevices form ugadi, telugu new year ugadi,

Hyderabad metro rail will run from next year instead of first phase from March 21

ఉగాది కాదట.. వచ్చే ఏడాదే పట్టాలెక్కనుందట.. మెట్రో

Posted: 02/25/2015 02:22 PM IST
Hyderabad metro rail will run from next year onwards

జంటనగర వాసులు ఎంతో ఉత్కంఠగా ఎదరురూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఈ ఉగాదిన ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. వచ్చే ఏడాదే ఈ రైలు పట్టాలను ఎక్కనుందని సమాచారం. మెట్రో రైలు ప్రారంభోత్సవాలు, దశల వారీగా చేసి నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు కాలుష్యనివారణ చేయాలని తలచిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందని తెలుస్తోంది. దశల వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పూర్తి అయిన తరవాతే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో సుమారు 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో రైలు ఒప్పందంలో భాగంగా మొత్తం మార్గాన్ని 2016 డిసెంబరులోగా పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా మెట్రో ప్రయాణాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) పేర్కొంది. అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన వివరాలను సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. మెట్రో అంశాన్ని అందులో ప్రస్తావించారు.

ఉగాది నుంచి ప్రయాణాలు ప్రారంభమవుతాయన్న కథనాలకు చెక్ పెట్టిన ప్రభుత్వం.. అవి వచ్చే ఏడాది నుంచే అన్ని దశల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. నిర్మాణంలో భాగంగా ఆరు దశల్లో మెట్రోరైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. 2015లో మూడు దశలు 29 కిలోమీటర్లు, 2016లో మరో మూడు దశల్లో 42.16 కిలోమీటర్ల మేర ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. అందులోభాగంగా మొదటి దశలో ఎనిమిది కిలోమీటర్ల నాగోలు నుంచి మెట్టుగూడ మార్గాన్ని ఈ ఏడాది మార్చి 21న ప్రారంభించాలనుకున్నారు. ఇందుకోసం వివిధ దశల్లో మెట్రో రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. అధికారికంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు కావాల్సిన రైల్వే భద్రతా వ్యవస్థ అనుమతి ధ్రువపత్రం అందకపోవడంతోనే మొత్తం ప్రాజెక్టును ఏకకాలంలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad metro rail  hyderabad  telangana  

Other Articles