భూసేకరణ ఆర్డినెన్స్ పై రాజ్యసభ అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, కేవలం కార్పోరేట్ వర్గాలకు లాభం చేకూరేలా ఆర్డినెన్స్ ఉందని విపక్షాలు ఆరోపించాయి. అన్నా హజారే నిరసన, రాహుల్ గాంధీ నిరసనల నేపథ్యంలో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది. అదీ కాకుండా కాంగ్రెస్ కు కేవలం రాజ్యసభలో మాత్రమే గట్టి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ సభలోనే తమ నిరసన గళాన్ని వినిపించాలని అనుకుంటోంది. కాంగ్రెస్ కు తృణముల్ కాంగ్రెస్ అండగా నిలిచింది. ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తు తృణముల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు నినాదాలు చేశారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, అందుకే అడ్డదారిలో ఆర్డినెన్స్ లను నమ్ముకుందని విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం బైపాస్ లాంటి ఆర్డినెన్స్ లతో గట్టెక్కాలని చూస్తోందని విమర్శించాయి. ఆర్డినెన్స్ అనేవి పార్లమెంటుకు బైపాస్లాంటివి కాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వీటి విషయంలో తాము ఏ తప్పు చేయడం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో భూసేకరణ అంశంతోపాటు పలు ఆర్డినెన్స్‌పై చర్చకు వచ్చాయి. "గతంలో ఉన్న ప్రభుత్వాలు 636 ఆర్డినెన్స్ లు తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నాయి. చట్టాలు చేశాయి. అందులో 80శాతం ఆర్డినెన్స్ లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశారని జైట్లీ ధ్వజమెత్తారు. తమది బైపాస్ రూట్ అని ఆరోపణలు చేయడం తప్పు''అని జైట్లీ విమర్శలను తిప్పికొట్టారు. ఆర్డినెన్స్‌పై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకీ లేదని చెప్పారు.
మరోవైపు ప్రధాని మోదీ సభలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అంతా సజావుగా ఉందని, ఎలాంటి మార్పులు అవసరం లేదని అన్నారు. విపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. సంబందిత మంత్రులు, ఎంపీలు ఆర్డినెన్స్ కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఆర్డినెన్స్ పై వెనక్కి వెళ్లే ఆలోచన లేదని మోదీ స్పష్టం చేశారు. మొత్తానికి రెండవ రోజు పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more