Modi turns big business for air

All India Radio, Mann Ki Baat, All India Radio revenues, All India Radio earnings, Narendra Modi Mann Ki Baat, Modi Obama Mann Ki Baat, live commentary in AIR, senior AIR official, Prime Minister, Narendra Modi, Mann ki Baat, GlaxoSmithKline, CVL Srinivas South Asia, All INdia radio

Modi rescues All India Radio – With Prime Minister Narendra Modi hosting show in All India Radio, the national radio broadcaster is making good revenues.

కాలం చెల్లిన సమయంలో.. కాసుల వర్షం కురిస్తున్న మోడీ..

Posted: 02/21/2015 06:14 PM IST
Modi turns big business for air

కాలం చెల్లిందనుకుంటున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ సరికోత్త ఆలోచన దానికి ప్రాణం పోసింది. జీవాన్ని పూరించింది. మళ్లీ పూర్వ వైభవం దిశగా ముందుకు సాగింది. ఏంటది అనుకుంటున్నారా..? అదే ఆకాశవాణి.. రేడియో. కేబుల్ టీవీల ఆగమనంతో రేడియోలను, ట్రాసిస్టర్లను పక్కన బెట్టారు. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కడంతో మళ్లీ పుంజుకున్న రేడీయోను.. స్మార్ట్ ఫోన్లు, పోన్లలో తమకు ఇష్టమైన పాటలను డౌన్ లోడ్ చేసుకుని నిల్వ చేసుకోవడంతో మళ్లీ రేడియోకు వచ్చినట్లే వచ్చిన మహర్ధశ చేజారింది. అయితే ఇప్పటికే ఇంకా గ్రామీణ భారతంలో రేడియో తన ఆధిపత్యాన్ని చాటుతున్నా.. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో మాత్రం అంతంతమాత్రంగానే వుంది.

దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రజలతో నేరుగా మాట్లాడాలని సంకల్పించారు. ఈ క్రమంలో గ్రామీణ భారతావణితో ముడివేసుకున్న రేడియోను సాధనంగా వినియోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రతి నెల ముందుగా నిర్ణయించే ఆదివారం రోజున తన మస్సులోని మాటలను ఆయన దేశ ప్రజలతో పంచుకుంటారు. అ కార్యక్రమమే ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ తరుణంలో జట్కా బండిలా నడుస్తున్న ఆకాశవాణి, అదేనండి అల్ ఇండియా రేడీయోను ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. అదెలా అంటారా..?

ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ భాత్ ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోకు అత్యధికంగా ధనాన్ని ఆర్జించే వనరుగా మారింది  ఫిబ్రవరి మాసంలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో వాణిజ్య ప్రకటనలు వేసేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. దీనిని వాణిజ్యంగా మర్చుకున్న ఆల్ ఇండియా రేడియో .. వివిధ వాణిజ్య ప్రకటనలను తీసుకుని ఇప్పటికే సుమారు 25 లక్షల రూపాయలను ఆర్జించింది. పది సెకన్ల నిడివి గల వాణిజ్య ప్రకటన కోసం పలు సంస్థలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఒక పదినిమిషాల స్లాట్ కోసం సుమారు రెండు లక్షల రూపాయలను కూడా కంపెనీలు వెచ్చిస్తున్నాయి. దటీజ్ నరేంద్ర మోడీ..!

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : All India Radio  Mann Ki Baat  Narendra Modi  

Other Articles