Five scotland batsmen dockout

ICC World Cup 2015, New Zealand, New Zealand vs Scotland, New Zealand vs Scotland highlights, Scotland newzealand won the match, newzealand score, scotland score, five duck outs, world cup photos, world cup videos, world cup stills, world cup updates, world cup latest news, world cup latest updates, world cup latest stills, world cup latest photos, world cup latest news, world cup forth comming matches, world cup individual scores,

Scotland struggle against ruthless New Zealand as there were five ducks recorded in the Scotland innings.

కివ్విస్ బౌలర్ల ధాటికి విలవిలాడిన పసికూనలు..

Posted: 02/17/2015 10:09 AM IST
Five scotland batsmen dockout

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో స్కాట్ లాండ్ చతికిలపడింది. స్వల్స స్కోరుకే చాపచుట్టేసింది. కివ్వీస్ బౌలింగ్ ధాటికి పసికూనలు విలవిలలాడాయి. మాచన్(56), బరింగ్టన్(50) రాణించినా మిగతా బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు. మరో ఇద్దరు(క్రాస్ 14, డావే 11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు డకౌటయ్యారు. మెక్‌లియోడ్, గార్డినర్, మామ్‌సెన్, హక్, వార్దలాలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

మ్యాచ్ ఆరంభం నుంచే స్కాట్ లాండ్ ఆటగాళ్లకు కివీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక్క పరుగుకే ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ కు పంపారు. వరుసగా వికెట్లు తీసి ఈ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో 82 బంతులు మిగిలివుండగానే 142 పరుగులకే స్కాట్ లాండ్ ఆలౌటైంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket-world cup-2015  New Zealand  Scotland  

Other Articles