Kejriwal new look in jacket

kejriwal new look, mufler man, media on mufler, aam aadmi, style icon kejri

kejriwal look new in jocket. in the delhi elections kejriwals mafler very stylish icon. media focus on that. after won in delhi media highletly titled kejri as mufler man.

మఫ్లర్ పోయింది..జాకెట్ వచ్చింది : కేజ్రీవాల్ కొత్త రూపం

Posted: 02/14/2015 11:26 AM IST
Kejriwal new look in jacket


ఎన్నికల భారతం ప్రతి సారి కొత్త విషయాలను నేర్పిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అద్భుత విజయం తర్వాత అన్ని మీడియాల్లో మఫ్లర్ మ్యాన్ అనే పదం బాగా ఫేమసైంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ ను మఫ్లర్ మ్యాన్ అంటూ చూపించిన మీడియా, ఆ స్టైల్ ను  ప్రజలకు చాలా చేరువ చేసింది. మఫ్లర్ మ్యాన్ చేసిన మాయ అంటూ చాలా మంది రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు అందుకు తోడయ్యాయి.  ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారసభలన్నింటికి ఆప్ అధినేత కేజ్రీవాల్ మఫ్లర్ తో హాజరయ్యారు.  నిజానికి ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మఫ్లర్ లను వాడతారు. అదే ఇప్పుడు ఇక్కడ హైలెట్ గా నిలుస్తోంది.

ఎన్నికల్లో కేజ్రీవాల్ ధరించిన ఆ మఫ్లర్ చాలా మందికి ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. కానీ కేజ్రీవాల్ కు మద్దుతగా ఢిల్లీ వ్యాప్తంగా ఉంచిన కటౌట్లలో జాకెట్ లో కనిపించడం ఇప్పుడు మీడియాలో హాట్ గా మారింది.  ఇలా మఫ్లర్ ను వదిలేసి జాకెట్ కు మారడంపై సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్లు మొదటయ్యాయి. పదవిలోకి రాగానే సామాన్యుడు కూడా మారతాడు అని చేస్తున్న కామెంట్లు హాట్ గా మారాయి. మొత్తానికి తన క్రేజీ స్టైల్ ను వదిలిన కేజ్రీవాల్ భవిష్యత్తులో ఇంకా ఏం వదులుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal new look  mufler man  media on mufler  aam aadmi  style icon kejri  

Other Articles