7 killed more than 60 injured as train derails at karnataka tamil nadu border

Bangalore-Ernakulam Inter-city express, train accidents, derail , bangalore ernakulam train derailed, inter city express derailed, 7 passengers killed in train mishap, Inter City Express derailed near Anekal, how do train accident occur, list of injured in inter city express derailed,

7 passengers were killed and more than 60 have been injured, some of them critically after the Bangalore-Ernakulam Inter City Express derailed near Anekal, near Tamil Nadu on Friday.

ITEMVIDEOS: మృతులకు పరిహారం.. ప్రమాదఘటనపై విచారణకు అదేశం

Posted: 02/13/2015 12:38 PM IST
7 killed more than 60 injured as train derails at karnataka tamil nadu border

కర్ణాటకలో ఘేర ప్రమాదం సంభవించింది.  హోసూరు వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 10మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొందరి పరిస్థితి విషమంగా వుంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అనధికార వర్గాల సమాచారం. ప్రమాధ ఘటనలో. మరో వందమందికి పైగా గాయపడ్డారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళుతుండగా బెంగళూరు-తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సమీపంలో ఉదయం 7.40 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే అవి పూర్తిగా ఒకదానికి ఒకటి ఇరుక్కుపోవడంతో.. వాటని తొలగించేందకు అధికారులు చర్యలు చేపట్టారు. D-8 బోగీ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ బోగిలోనే ఏడు మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు 10 అంబులెన్స్ల్లో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా బోగీల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, రైల్వే సిబ్బంది... బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. గాయపడినవారిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రైలు ప్రమాదఘటన సమాచారాన్ని అందుకున్న కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి యుటి ఖాదర్ క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని అదేశించారు. ఇందుకోసం పదులు సంఖ్యలో అంబులెన్సులను ఘటనాస్థలానికి తరలించామని చెప్పారు. అటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా రైలు ఘటన సమాచారం అందుకోగానే తక్షణం ప్రమాదానికి గల కారణాలపై విచారణ అదేశించారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల మేర నష్టపరిహారాన్ని ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి యాభై వేల రూపాయలు, క్షతగాత్రులకు 20 వేల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. ఇది చాలా దురదృష్టకర ఘటనగా ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిందని, రైల్వే సీనియర్ అధికారులందరూ ఘటనాస్థలానికి చేరుకున్నారని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore-Ernakulam Inter-city express  train accident  derail  7 killed  

Other Articles