Ap cm chandrababu warangal tour

ap cm, chandra babu, ttdp, babu warangal tour, tdp tour in warangal, mrps, trs, oppose the tour

ap cm first telangana warangal tour ends. trs and mrps leaders oppose the tour. ap cm chandrababu said that if there any problems sit and settle. ap and ts have many problems. ap has budget deficiency, ts has electricity deficiency.

ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం..చంద్రబాబు

Posted: 02/13/2015 08:38 AM IST
Ap cm chandrababu warangal tour


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన వరంగల్ యాత్ర నిరసల మధ్య ముగిసింది. టిఆర్ఎస్, ఎమ్మార్పియస్ కార్యకర్తలు చంద్రబాబు యాత్రపై నిరసనలు తెలిపారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య చంద్రబాబు యాత్ర ముగిసింది. వరంగల్ యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు తెలంగాణ అమరవీరులకు నివాళర్పించారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా మానసికంగా కలసి ఉండాలనేదే తన అభిప్రాయమని ఆయన చెప్పా రు. సమస్యల పరిష్కారం కోసం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామంటే ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటాపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం లేదని బాబు వ్యాఖ్యానించారు.

ఒక సారి విభజనకు గురైన  రెండు రాష్ట్రాలు కలవవని ఆయన అన్నారు.విభజనకు గురైన రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఆశించారు. సున్నితమైన తెలంగాణ అంశంలో కొందరు పార్టీని ఇబ్బంది పెట్టాలని చూశారని అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని అప్పుడు ఆ నాడే అన్నాను. నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, కరెంటు విషయంలో తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cm  chandra babu  ttdp  babu warangal tour  tdp tour in warangal  mrps  trs  oppose the tour  

Other Articles