Ts govt decided to chenge the logo on 108

108 logos, 108 ambulance, govt on emri, govt on 108 vehcle, emergency vehcles

ts govt decided to chenge the logo on 108 : ts govt. decided to change the logo on 108 vehcles. on new vehcles has kcr logo. and govt also brougt new 290 vehcles.

108 పై బొమ్మ మారింది ..మరి పరిస్థితి..?

Posted: 02/12/2015 03:48 PM IST
Ts govt decided to chenge the logo on 108

ప్రభుత్వంలోకి రాగానే తమ పార్టీ గుర్తులను, వ్యక్తుల బొమ్మలతో కొత్త రేషన్ కార్డులు జారి చెయ్యడం అందరికి అలవాటైంది. గత ప్రభుత్వం తప్పుడు లెక్కలు చేసింది, మళ్లీ సర్వే చేపి కొత్త కార్డులను ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ఇలా ప్రభుత్వం మారిన ప్రతీసారి కార్డులు, కార్డుల మీద బొమ్మలు మారడం మామూలే. ప్రభుత్వం అత్యవసర సమయాల్లో ఆదుకునే అంబులెన్స్ ల మీద కెసిఆర్ బొమ్మ వెయ్యాలని నిర్ణయించింది.

 అంబులెన్స్ లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హార్ట్ ఎటాక్ పేషంట్లకు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే పరికరాలను, వాహనం ఎక్కడుందో తెలుసుకునేలా ఆటోమేటిక్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్, సడన్ బ్రేక్ వేసినప్పుడు అదుపుతప్పకుండా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ , ట్యూబ్‌లెస్ టైర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు అంబులెన్స్ లలో అదనంగా రక్తం బాటిళ్లను అందుబాటులో ఉంచుతారు. 108 కోసం కొత్తగా 290 వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 108 వాహనాలు 316 ఉంటే వాటిలో  121 అంబులెన్స్ లు పూర్తిగా పాడైపోయాయి. ఇవి పోగా మిగిలిన 195 వాహనాలు మాత్రమే సిద్దంగా ఉన్నాయి. పాతవాటికి తోడు కొత్తగా మరో 290 వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇలా మొత్తం 485 అంబెలెన్స్ లు ప్రజలకు అందుబాటులొకి రానున్నాయి.  మరో 21 అంబెలెన్స్ వాహనాలను రిజర్వులో ఉంచుతారు. సీఎం బొమ్మతోపాటు తెలంగాణను ప్రతిబింబించే విధంగా 108 వాహనాలపై లోగోను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ లోగోను కూడా ఏర్పాటు చేస్తారు.

అయితే బొమ్మ సంగతేమో కానీ 108 వాహనాలకు మళ్లీ పూర్వ వైభవం తేవాలని ప్రజలు కోరుతున్నారు. గత నాలుగైదు సంవత్సరాల నుండి 108 వాహనాల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలా వాహనాలకు మెంటెనెన్స్ లేక మూలన పడ్డాయి. అలాగే ఉన్న వాహనాలకు కనీసం డిజిల్ కూడా కొట్టించడానికి డబ్బులు లేకుండా పోవడంతో అవి పని చెయ్యడం మానేశాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 108 వాహనాలను పూర్తి స్థాయిలో సిద్దం చేస్తామని గతంలో కెసిఆర్ ప్రకటన చేశారు. 108 వాహనాలను నడుపుతున్న ఇ.ఎమ్.ఆర్.ఐ తో సమావేశాన్ని నిర్వహించారు. వీటి బాగోగులు చూస్తున్న జివికె తోనూ చర్చలు జరిపారు. మరి ఇప్పుడు కొత్తగా తెచ్చే వాహనాలతో కలిపి తెలంగాణ సర్కార్ 108 ని ఎలా నడుపుతుందో వేచి చూడాలి.
 
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 108 logos  108 ambulance  govt on emri  govt on 108 vehcle  emergency vehcles  

Other Articles