Hero mahesh babu as brand ambassador of hyderabad

mahesh as brand ambassador of hyderabad, telangana government to appoint mahesh babu, TS government appoint mahesh babu as hyderabad brand ambassador, hyderabad brand ambassador mahesh babu, tollywood hero mahesh as hyderabad brand ambassador, telangana chief minister KCR, telangana government,

telangana government to appoint tollywood hero mahesh babu as brand ambassador of hyderabad

హైదరాబాద్ బ్రాండ్ పెంచే పనిలో మహేష్ బాబు..!

Posted: 02/12/2015 03:25 PM IST
Hero mahesh babu as brand ambassador of hyderabad

హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు బ్రాండ్ అంబాసిడర్ సాయం తీసుకోవాలని, అంతకన్న ముందు నగర ప్రజలతో పాటు విశ్వవాప్తంగా మంచి ఇమేజ్ వున్న వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. డల్లాస్ నగరం కంటే ఘనంగా భాగ్యనగరాన్ని మార్చుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, తాజాగా 'హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ నటుడు మహేష్ బాబును నియమించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, బ్రాండ్ వాల్యూ పెంచే అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.  

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మాణం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్న ఆయన హైదరాబాద్కు ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని యోచిస్తున్నారు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం నియమించింది. ఇక అన్నివర్గాల్లో క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే బాగుంటుందని కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన కొంతమంది సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహేష్ బాబుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana government  mahesh babu  hyderabad brand ambassador  

Other Articles