Girl birth after 200 years

girl birth after long time, lorry got girl child

girl birth after 200 years : a girl birth after a long period of 200 years. in lorry family celebrate the birth of girl child.

200 సంవత్సరాల తరువాత ఆడపిల్ల పుట్టింది

Posted: 02/11/2015 06:15 PM IST
Girl birth after 200 years

200 సంవత్సరాల నుండి ఆ వంశంలో ఒక్క ఆడశిశువు కూడా పుట్టలేదు. అందరూ మగ వారే. గడ్డాలు , మీసాలతో విసిగిపోయిన ఆ కుటుంబం ఆడపిల్ల కావాలని కోరుకుంది. ఆ కల నెరవేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇది ల్యారీ అనే ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన భిన్నమైన కథ. గత 200 సంవత్సరాల నుండి ఒక్క ఆడపిల్లలేకపోవడం నిజంగా వింతేగా మరి.

ల్యారీ వంశంలో చివరి సారిగా 1809వ సంవత్సరంలో ఒక పాప జన్మించింది. అప్పటి నుంచి ఎన్ని తరాలు మారినా పరిస్థితి మారలేదు. అబ్బాయిలే పుడుతున్నారు.. వారు పెద్ద అవుతున్నారు, వారికి  పెళ్లిళ్లు అవుతున్నాయి, పిల్లలు కూడా పుడుతున్నారు కానీ వారంతా అబ్బాయిలే! కొన్ని తరాల కిందటే ల్యారీల వంశం తమ ఇంట్లో ఆడశిశువుల జననం కలగడం లేదని తెలుసుకుంది.

దాంతో ఆ వంశంలో ఆడపిల్ల కావాలనే కోరిక బలపడింది. ఐదు తరాల ఈ ఆవేదనను తీరుస్తూ ఇటీవలే ఆ ఇంట్లో పాపపుట్టింది. ల్యారీల వంశంలోని మార్క్‌కు నలుగురబ్బాయిల తర్వాత ఐదో సంతానంగా పాపపుట్టింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం చాలా ఆనందపడుతోంది. ఐదు తరాలుగా తమ ఇంట్లో అమ్మాయిలే లేరని.. ఇప్పుడు పాప పుట్టడంతో తమ కుటుంబం మొత్తం ఎంత ఆనందిస్తోందో చెప్పడానికి మాటలు చాలడం లేదని మార్క్ అంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl birth after long time  lorry got girl child  

Other Articles