Unknown group warned the isis on youtube

isis, terrorism, islam terrorisam, hawking

unknown group warned the isis on youtube. that group said that isis is a virus, we have the treatment because we have the internet in our hand.

ITEMVIDEOS: ఐఎస్ఐఎస్ వైరస్ కు మేం చికిత్స చేస్తాం

Posted: 02/11/2015 04:49 PM IST
Unknown group warned the isis on youtube

మతం పేరుతో రక్తపాతం సృష్టిస్తు, ఎంతో మంది జీవితాలను బలి తీసుకున్న ఉగ్రవాదాన్ని జీహాద్ అంటూ కొత్త అర్థాన్నిస్తున్న ఐఎస్ఐఎస్ పై యుద్దాన్ని ప్రకటించారు ఓ ఆకాశరామన్న గ్రూప్. ఒకప్పుడు ప్రభుత్వ, వ్యాపార సంస్థల వెబ్‌సైట్లను హ్యాకింగ్ చేసిన ఆ ఆకాశరామన్న గ్రూప్ ఇప్పుడు ఇలా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కే సవాలు విసరడం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే ఐఎస్‌ఐఎస్ నెట్‌వర్క్‌ను చిన్నాభిన్నం చేసే లక్ష్యంగా చురుగ్గా పనిచేస్తోంది. సోషల్ వెబ్‌సైట్లలో ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న ఖాతాలను వెతికిపట్టుకొని వాటిని నాశనం చెయ్యడమే పనిగా పెట్టుకుంది.


 
ఇప్పటి వరకు  అలాంటి 800 ట్విట్టర్ ఖాతాలను, 12 ఫేస్‌బుక్ పేజీలను, 50 ఈ మెయిల్ అడ్రస్‌ల గల్లంతుకు తామే బాధ్యులమంటూ గర్వంగా ప్రకటించుకుంది. నెల రోజుల క్రితం నుండి ఈ ఆకాశరామన్న గ్రూప్ యుద్దాన్ని ప్రకటించింది. తాజాగా మరో సారి ఐఎస్ఐఎస్ కు హెచ్చరికలు జారి చెయ్యడంతో వార్తలకెక్కింది. ‘మిమ్మల్ని ఓ వైరస్‌లా చూస్తాం. ఆ వైరస్‌కు మేమే చికిత్స చేయగలం. ఇంటర్నెట్ మా చేతుల్లో ఉంటుంది’ అని ఐఎస్‌ఐఎస్ టైస్ట్ సంస్థనుద్దేశించి యూట్యూబ్ ద్వారా మెసేజ్ చేసింది. ప్రభుత్వ విభాగాలు, కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ద్వారా కొన్నేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన ఈ గ్రూప్, జనవరి 12వ తేదీన చార్లీహెబ్డో ఫ్రెంచ్ మ్యాగజైన్‌పై టైస్టులు దాడి తర్వాత వారికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు అందరికి తలనొప్పిగా మారిన ఆకాశ రామన్న గ్రూప్ ఇప్పుడు ప్రపంచానికి ముప్పుగా మారిన ఐఎస్ఐఎస్ పై పోరాడటం అభినందనీయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  terrorism  islam terrorisam  hawking  

Other Articles