Results of delhi assembly polls started

delhi assembly polls, delhi assembly polls counting, delhi assembly polls counting started, aap leads in ounting, bjp, congress, ajay maken, amit shah, narendra modi, aravind kejriwal, kiran bedi, rahul gandhi

aap party leads in delhi assembly polls counting

ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్

Posted: 02/10/2015 07:57 AM IST
Results of delhi assembly polls started

మూడు పార్టీల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రారంభమైంది. అయితే బీజేపి, ఆప్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.. కాగా పటిష్ట భద్రత నడుమ ఢిల్లీలోని 14 కేంద్రాల్లో లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 70 స్థానాల తుది ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ జరిగిన శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు స్పష్టమైన మెజారిటీని అంచనావేయగా.. వాటిని తోసిపుచ్చిన బీజేపీ 38 స్థానాల్లో గెలుస్తామని పేర్కొంది.
 
ఫలితాలపై ఆందోళన లేదు.. ఫలితాల గురించి ఉత్కంఠ కానీ, ఆందోళన కానీ లేదని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ అన్నారు. గత 17 రోజులుగా సాధ్యమైనంత వరకు కృషి చేశానని, తన చేతుల్లో లేని ఫలితాల గురించి ఆదుర్దా పడబోనని కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ ఎన్నికలను మోదీ పాలనకు రిఫరెండంగా పేర్కొంటున్నందున.. ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

కాగా, సదర్‌బజార్ స్థానం నుంచి పోటీ చేసిన అజయ్ మాకెన్ ఆ స్థానంలో ఓడిపోనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. అదే జరిగితే పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తానని మాకెన్ తన సన్నిహితులతో స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ 3, 4 స్థానాలను మించి గెలుచుకోబోదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. అది పార్టీకి వినాశకరమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi assembly polls  counting  AAP  BJP  

Other Articles