India fastest growing economy

India fastest growing economy, Economy grew by 7.5 per cent, economy, business, finance, India, GDP growth rate, factor cost, market prices, 2013, 2014, 2015, gross domestic product, current fiscal grew by 7.5 percent, economic out put

Economy grew by 7.5 per cent in the September-December quarter of the current fiscal

వేగంగా అభివృద్ది.. 7.5 శాతంతో భారత్ జీడీపీ జోరు

Posted: 02/10/2015 07:55 AM IST
India fastest growing economy

ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరం (2014-15)లో  దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జోరందుకుని, 7.4 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం తాజా అంచనాల్లో ప్రకటించింది. 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మార్పు ప్రకారం ప్రభుత్వం తాజాగా ఈ అడ్వాన్డ్ (ముందస్తు) అంచనా గణాంకాలను విడుదల చేసింది. మారిన బేస్ ఇయర్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2013-14లో వృద్ధి రేటును 4.7%-6.9%కి ఇటీవల సవరించిన సంగతి తెలిసిందే. తాజా ఫార్ముల్లాకు అనుగుణంగా ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 6.9% నుంచి 7.4 శాతానికి (గత అంచనాలు 5.5%) ఎగబాకనున్నట్లు కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌ఓ) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 7.5%గా నమోదయ్యింది.

వాస్తవిక జీడీపీ (లేదా) 2011-12 స్థిర ధరల ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ. 106.57 లక్షల కోట్లు ఉంటుందని తాజా విధానం అంచనా వేస్తోంది. 2015 జనవరి 30న విడుదలైన ఫస్ట్ రివైజ్డ్ అంచనా ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2013-14) ఈ విలువ రూ.99.21 లక్షల కోట్లు. అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో జీడీపీ విలువ 7.4 శాతం వృద్ధితో రూ.99.21 లక్షల కోట్ల నుంచి రూ.106.57 లక్షల కోట్లకు చేరుతుందన్నమాట. ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ విలువ 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.113.45 లక్షల కోట్లతో పోల్చితే 2014-15లో 11.5% వృద్ధితో రూ.126.54 లక్షల కోట్ల స్థాయికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనావేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian economy  fast growing  7.5 percent  

Other Articles