Delhi vote67 percentage

delhi elections 2015, voters in delhi

delhi voter utilise their right to vote in this season. results will deliver on 10 of this month.

ముగిసిన పోలింగ్...అధికారం ఆప్ కే సొంతం అంటున్న ఎగ్జిట్ పోల్స్

Posted: 02/07/2015 07:32 PM IST
Delhi vote67 percentage

ఢిల్లీలో పోలింగ్ ఘట్టం ముగిసింది. గత ఎన్నికల్లో మాదిరిగా ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు పోలింగ్ బూతులకు బారులు తీరారు. తమ భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఏలెత్తారు. గత ఎన్నికల్లో 66 శాతం నమోదు కాగా  ఈ ఎన్నికల్లో 67శాతం ఓటింగ్ నమోదైంది. 1.3 కటోల్ మంది ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రారంభం నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యు కట్టారు. ఓటు వెయ్యడానికి రెండు గంటల పాటు క్యులో నిల్చోవలసి వస్తోందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కానీ అలాంటిదేమీ లేదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇచ్చారు.  

కాగా ముగిసిన పోలింగ్ పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్ని ఆప్ కే ఢిల్లీ ప్రజలు పట్టంకట్టినట్లు తెలుపుతున్నాయి. అయితే అందరూ అనుకున్నట్లు కాకుండా ఈ ఎన్నికల్లో ఆప్ ఓటింగ్ శాతం పెరిగిందని, కాంగ్రెస్ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాగా బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు ఆశించిన తీరులో మార్పు రాలేదని స్పష్టమవుతోంది. ఇక కిరణ్ బేడి ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించాల్సిందేనని వ్యాఖ్యానించారు.  ఇక అధికారికంగా ఈ నెల 10 తేదిన ఎన్నికల ఫలితాల వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi elections 2015  voters in delhi  

Other Articles