No media coverage for the opposition leaders of ap

raghuveera, comment on ap cm, chandra babu naidu, cm realestate business

no media coverage for the opposition leaders of ap: oppostion party leaders in ap the media didn't gave priority to coverage. raghuveera attacks on ap cm chandrababu naidu.but media didn't give any priority.

రఘువీరా వినేదెవ్వరు..!

Posted: 02/06/2015 05:53 PM IST
No media coverage for the opposition leaders of ap

టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ దందాకు పునుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమవుతున్నారని రఘువీరా ఆరోపించారు. కేంద్రం నుండి నిధులను సేకరించడంలోనూ చంద్రబాబు విఫలమవుతున్నారని ఎపి కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. కానీ ఇంత మాట్లాడినా రఘువీరా , ఇతర నాయకుల మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఏ మీడియా రఘువీరా మాటలకు ప్రధాన్యం ఇవ్వకపోవడం విశేషం. బలం లేకుంటే అరటిపండు తిన్నా పళ్లు విరగడం అంటే ఇదే మరి. మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారా అని ఎదురుచూసిన వాళ్లు ఇప్పుడు ఎదురుపడినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం రఘువీరారెడ్డి ఒక్కరి విషయంలోనే కాదు ఎపి కాంగ్రెస్ నాయకుల్లో చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. అయినా తిరిగి అధికారంలోకి వస్తామని, పాజిటివ్ ఆటిట్యూడ్ ను ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera  ap cm vs raghuveera  media coverage  ap congress  

Other Articles