Kcr performe one man show telangana govt didn t count opposition leaders opiniun

cm kcr, ravindra bharathi renovation, ntr stadium, international auditorium in hyd

telangana first cm kcr performing one man show. kcr didn't ask any suggetions from opposition. opposition leaders oppose kcr .

వన్ మ్యాన్ షో... బై కెసిఆర్

Posted: 02/06/2015 05:49 PM IST
Kcr performe one man show telangana govt didn t count opposition leaders opiniun

"ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ప్రతిపక్షాలతో పాటు అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తాం, ఒంటెద్దు పోకడలకు మేం దూరం''అని కెసిఆర్ తొలి తెలంగాణ శాసన సభలో పలికిన పలుకులు. కానీ ఆచరణలో మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. బాధ్యతాయుతమైన పాత్రను పోషిద్దాం అంటూ పిలుపునిచ్చిన ఆయనే దాన్ని బ్రేక్ చేస్తున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఒక్కటంటే ఒక్క నిర్ణయంలోనూ ప్రతిపక్షాలను సంప్రదించడం లేదు.  రవీంద్ర భారతి అధునీకరణ, ఎన్టీఆర్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలచిన ఆడిటోరియం ఇలా ప్రతి విషయంలోనూ కెసిఆరే నిర్ణయం తీసుకుంటున్నారు.

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కెసిఆర్ పర్సనల్ గా తీసుకుంటున్న నిర్ణయాలని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షంలోని వారి మాటలను ఎప్పుడు పట్టించుకున్నారు గనక. ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిన కెసిఆర్ ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతారని కొందరు అనుకుంటున్నారు. పొగిడే వాళ్లు పొగడనీ...తిట్టే వాళ్లు తిట్టని...డోంట్ కేర్ అంటూ సాగుతున్నారు కెసిఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravindra bharathi renovation  kcr  telangana govt.  

Other Articles