Vangapandu gets rare identity

vangapandu gets rare identity, vangapandu nominated honarary president, parvathipuram, vangapandu popular folk revolutionary singer, vangapandu, AP telugu culture and folk groups, Telugu balladeer vangapandu, poet and lyricist vangapandu,

vangapandu prasada rao has been declared as honarary president of AP telugu culture and folk groups

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వంగ‘పండుగ’

Posted: 02/05/2015 08:44 AM IST
Vangapandu gets rare identity

ఎం పిల్లో ఎల్దామోస్తవా..? ఎం పిల్లడో ఎల్దామోస్తవా..? అనే పాట గుర్తుందా..? మగధీర చిత్రంలో ఈ ట్యూన్ వాడిడంతోనే అప్పటివరకు నిగూఢంగా వున్న విప్లవ వాగ్గేయకారుడు లేచాడు. తన ట్యూన్ ను ఎలా వాడతారని అభ్యంతరం తెలిపాడు. ఆ తరువాత రాష్ట్ర విభజన క్రమంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి పాటలు రచించి పాడి నవ్యాంధ్ర ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అతనే వంగపండు ప్రసాదరావు. ఇంటిపేరు వంగపండుగా ఆయన చాలా పేరొందారు. తన రచనలకు ఆయన తన ఇంటిపేరునే పెట్టారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటారా..? ఎట్టకేలకు ఆయనలోని కళా హృదయాన్ని ప్రభుత్వం గుర్తించింది.

నవ్యాంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి, జానపద సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా తనను నియమించినట్లు ప్రముఖ జానపద, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు తెలిపారు. పార్వతీపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యక్షునిగా తెలుగు విభాగ నాయకులు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కార్యదర్శిగా పుంగనూరు నటరాజ్, కోశాధికారిగా వసంత నాగేశ్వరరావులు వ్యవహరిస్తారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా విజయవాడలోని ఘంటసాల సంగీత ప్రాంగణంలో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తెలుగు భాషా సాంస్కృతిక, జానపద మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu culture  Vagapandu Prasada Rao  Folk Conference  

Other Articles