Police station turns to delivery room

police station turns to delivery room, complainant women gives birth in police station, mahaboobnagar, balanagar police station, delivery pains, male infant, complaint, delivery, woman, lover ramesh, mothi ganapur, medigadda thanda,

mahaboobnagar balanagar police station turns to delivery room as complainant women gives birth

డెలివరీ గదిగా మారిన పోలిస్ స్టేషన్..

Posted: 02/05/2015 08:14 AM IST
Police station turns to delivery room

పోలిస్ స్టేషన్ లు ఈ మధ్యకాలంలో కళ్యాణ మండపాలుగా మారిన ఘటనలు మనం చూశాం. అదేనండి పెద్దలు అంగీకరించని కులాంతర వివాహాలు చేసి.. పోలీసులు శబాష్ అనిపించుకున్న అనేక సందర్బాలు చూశాం. అయితే ఇదే క్రమంలో ఆ పోలిస్ స్టేషన్ డెలివరీ గదిగా మారింది. అదేలా అంటారా..? ఓ యువకుడి చేతిలో మోసపోయిన యువతి ఫిర్యాదు చేయడానికని వచ్చి పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ప్రసవించింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

మండలంలోని మోతిఘనపూర్ గ్రామపంచాయతీ మెడిగడ్డ తండాకు చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన రమేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. కానీ అతడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ అశోక్‌కుమార్ విచార ణ కోసం బుధవారం యువతిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ పురిటినొప్పులు రావడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో వైద్య చికిత్సలు చేయిస్తుండగా మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ శిశువుకు ఏడు నెలలు కూడా నిండకపోవడంతో మృతి చెందింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balanagar police station  delivery  mahaboobnagar  

Other Articles