Police officers attack sandalwood actor chetan at midnight

kannada actor chetan, sandalwood actor chetan news, police attack chetan, police lathi charge actor chetan, kannada actor chetan attack, sandalwood crime news

police officers attack sandalwood actor chetan at midnight : two police officers brutally attack on actor chetan with lathi without any reason.

కన్నడ నటుడికి పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Posted: 01/31/2015 01:33 PM IST
Police officers attack sandalwood actor chetan at midnight

అప్పుడప్పుడు పోలీసులు తమ పైశాచికత్వాన్ని సామాన్య ప్రజలపై ప్రదర్శిస్తుంటారు. ఏ తప్పు లేకపోయినా.. తమ పైశాచికానందాన్ని పొందడం కోసం ఇతరులపై ప్రతాపం చూపిస్తుంటారు. ఈ విధంగా కన్నడనాటలో పోలీసు అధికారులు కన్నడ నటుడిపై తమ లాఠీ ‘పంచ్’ రుచి చూపించారు. అతగాడు ఏ తప్పు చేయకపోయినా.. కావాలనే అతడిపై దాడికి దిగి పిడిగుద్దులు గుద్దారు.

వివరాల్లోకి వెళ్తే.. శాండల్ వుడ్ నటుడు చేతన్ మిడ్’నైట్ సమయంలో చర్చి గేట్’లోని తన మిత్రులను కలిసి తిరిగి వస్తుండగా.. అక్కడే వున్న పోలీసులు ఇతని కారును ఆపేశారు. కారణమేమీ చెప్పకుండానే అతని కారు తాళం తీసుకుని అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడట స్థానిక ఎస్సై! అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీపీ కూడా ఆ హీరో మీద చెయ్యి చేసుకున్నాడు. కొద్దిసేపు తన లాఠీతో అతడికి ‘పంచ్’ ఇచ్చి, బూతుపురాణాన్ని వినిపించారట!

దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చేతన్.. ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్’కు చేరుకున్నాడు. అయితే.. అక్కడా కూడా ఇతడిపై చెయ్యి చేసుకున్న ఎస్సై చేరుకుని, అతడిపై ఆగ్రహావేశంతో ఊగిపోయి లాకప్’లో వేశాడట! అలా కొద్దిసేపు తన ప్రతాపం చూయించిన అనంతరం అతడిని వదిలేశాడట! దీంతో తన తప్పు లేకపోయినా ఈ విధంగా పోలీసులు దారుణంగా ట్రీట్ చేయడంపై తన బాధను నగర పోలీస్ కమిషనర్ ముందు మొరపెట్టుకున్నాడు చేతన్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kannada actor chetan updates  police attack actor chetan  

Other Articles