Shazia ilmi more beautiful than kiran bedi says markandey katju

Shazia Ilmi more beautiful than Kiran Bedi, Markandey Katju admires shazia ilmi, former ips officer kiran bedi, BJP's chief ministerial candidate kiran bedi, kiran bedi, shazia ilmi, former AAP leader shazia ilmi, twitter, katju tweets on kiran bedi, katju tweets on shazia ilmi, katju sense of humour tweets,

Markandey Katju has sparked a row by apparently making a sexist comment involving Kiran Bedi and Shazia Ilmi where he compared their 'beauty'.

కవి కాదు కానీ.. షాజియా ఇల్మీ అందాన్ని పొగిడి.. ఇరుకున్నారు..

Posted: 01/31/2015 12:23 PM IST
Shazia ilmi more beautiful than kiran bedi says markandey katju

ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆ తరువాత భారత ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్.. అంతటి అత్యున్నత హోదాలో బాధ్యతలను నిర్వర్తించిన ఆయన.. ఎవరో మీకు తెలిసే వుంటుంది. ఆయనే మార్కండేయ కట్జూ. స్వతహాగా ఆచితూచి మాట్లాడే ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమయ్యాయి. అయితే కట్జూ వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడం, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడం మామూలే. అయితే ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యాలు మాత్రం వామ్మో కట్జూ.. అనేలా చేశాయి.

చింత చచ్చినా.. పిలుపు చావదన్న చందాన సుమారుగా ఏడు పదుల వయస్సులో ఆయన అందాన్ని పోగడటంతో ఇరుకున్న పడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కన్నా.. ఆ పార్టీలో చేరిన ఆప్ మాజీ నేత షాజియా ఇల్మీ అందంగా వున్నారని, ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించివుంటే కచ్చితంగా బీజేపి గెలుపొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసి మార్కండేయ కట్జూ ఇరుకున్న పడ్డారు. ప్రజలు అందంగా వున్నవారికి ఓటు వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. షాజియా ఇల్లీ లాంటి వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి వుంటే.. తనలాంటి ఓటు వేయడానికి ఇష్టపడని వారు కూడా ఓటే వేయడానికి వెళ్తారని కట్జూ ట్విట్ చేశాడు.

ఈ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో తాను అన్నదాంట్లో తప్పేమి లేదండూ మరో ట్విట్ చేశాడు. తన విమర్శకులపైనే సూటిగా ప్రశ్నలు కురిపించాడు. తన ట్విట్ వ్యాఖ్యలను తప్పబట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించాడు. తనలాంటి ఏడు పదుల వయస్సు వారు అందమైన యువతిని పోగిడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు అందమైన పుష్పాన్ని అభివర్ణించడంలో తప్పేంటని, దానిని కోస్తేనే తప్పని, అందమైన గార్డెన్ ను దూరం నుంచి అభివర్ణించడంలో తప్పులేదంటూ మరో ట్విట్ చేశారు. అయినా విమర్శకులు తగ్గకపోయే సరికి.. ఇవన్నీ సరదాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్  కోసం చేశానంటూ తీరిగ్గా సెలవిస్తూ మరో ట్విట్ చేశారు కట్జూ. అయితే ఇదే షాజియా ఇల్మీ, తన అందచెందంతో గత సార్వత్రిక ఎన్నికలలో బరిలో నిలిచినా.. ఎందుకు గెలవలేకపోయారో కట్జూకే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi-assembly-election-2015  Markandey Katju  Kiran Bedi  shazia ilmi  

Other Articles