Hyderabad techie planned to start jihad in india

Hyderabad techie Salman Moinuddin, IS sympathiser, jihad, middle east terror group, Islamic State of Iraq and Syria, ISIS, salman planned to start jihad in india, jihad in india, Indian Mujahideen, banned terrorist group IM, indian mujahideen sleeper cells, Im sleeper cells, Im sleeper cells in karnataka, IS sympathiser Mehdi Masroor Biswas, british girl friend nikki joseph alias ayesha, salman moinuddin, hyderabad software engineer, isis, islamic state,

Salman Mohiuddin, who was arrested for allegedly trying to leave the country to join the Middle-East terror group Islamic State of Iraq and Syria, revealed to police that he wanted to train himself to start jihad in india

జిహాద్ ను ప్రారంభించాలనుకున్నాడు.. 2500 మందికి ‘ఉగ్ర‘పాఠాలు నేర్పాడు..

Posted: 01/22/2015 09:59 AM IST
Hyderabad techie planned to start jihad in india

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి అకర్షితుడై అందులో చేరేందుకు బయలుదేరిన సానుభూతిపరుడుగా అనుమానిస్తున్న సల్మాన్‌ మొహినుద్దీన్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు వెలికితీశారు. న్యాయస్థానం పోలీసుల వినతి మేరకు సల్మాన్ మెహినుద్దీన్ ను నిన్న 10 రోజులు పోలీస్‌ కస్టడీ అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతని నుంచి ఇప్పటికే పలు కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. భారత దేశంలో జీహాద్ ను ప్రారంభించాలని సల్మాన్ పక్కా ప్రణాళికలు వేసుకున్నాడని కూడా తెలుసుకున్నారు.

రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌ బజార్ ఘాట్లో పుట్టి, పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన సల్మాన్ మొయినుద్దీన్ అనే ఇంజనీర్‌ సిరియా, ఇరాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోకి చేరేందుకు బయల్దేరి పోలీసులకు ఇటీవల చిక్కిన విషయం తెలిసిందే. అతని వద్ద నుంచి లాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్‌లు, పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సామాజిక వెబ్‌సైట్ల ద్వారా ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ అనుకూల ప్రచారం చేస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అతడి ప్రణాళికలు బయటపడ్డాయి.

అమెరికాలోని టెక్సాస్‌లోగల ఓ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్‌ పూర్తి చేసి అక్కడే నాలుగు సంవత్సరాలుగా ఉంటున్న మెయినుద్దీన్ కు బ్రిటెన్ కు చెందిన నిక్కి జోసెఫ్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె అతడికి కొందరు ఇస్లామిక్‌ ప్రముఖులతో పరిచయం చేసింది. వారి మాటలతో సల్మాన్‌ ఐఎస్‌ఐఎస్‌ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ ఉగ్రవాద సంస్థ రోజురోజుకూ బలం పుంజుకుంటుండడంతో ఆయేషా, మొయినుద్దీన్‌ మారుపేర్లతో ఫేస్‌బుక్‌ గ్రూప్స్‌ను ఏర్పాటు చేసి ఐఎస్‌ అనుకూల ప్రచారం సాగించడం మొదలుపెట్టారు.

తమలాంటి భావాలే ఉండి, స్పందించినవారు ఐఎస్‌ఐఎస్‌ కోసం పనిచేసేలా ఆకర్షించేవారు. అయితే, అమెరికాలోనే ఉండేందుకు గత ఏడాది నవంబర్‌లో మొయినుద్దీన్‌ దరఖాస్తు చేసుకోగా అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో, అతడు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇక్కడా సామాజిక సైట్ల ద్వారా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై నిఘా వేశారు. ఈ క్రమంలో అతడికి సిరియాకు చెందిన అబుఅల్‌బరా అల్‌సమి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ పలుమార్లు నెట్‌లో మాట్లాడుకున్నారు.

అబుఅల్‌బరా ఆహ్వానం మేరకు సిరియాకు వెళ్లేందుకు మొయినుద్దీన్‌ సిద్ధమయ్యాడు. ముందుగా దుబాయ్‌కు వెళ్లి అక్కడ అయేషాను కలుసుకొని ఇద్దరూ కలిసి టర్కీ మీదుగా సిరియాకు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే.. అబు అల్‌బరాతో మొయినుద్దీన్‌ ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరిపినప్పటి నుంచీ పోలీసులు మొయినుద్దీన్‌పై నిఘా పెంచారు. అతడి ప్లాన్‌ ముందే తెలిసిపోవడంతో దుబాయ్‌కు వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అతణ్ని అరెస్టు చేశారు.

అసలు సిరియాకు ప్రయాణమెందుకు..?

సల్మాన్ మెయినుద్దీన్ సిరియాకు ఎందుకు ప్రయాణమయ్యాడనే అంశంపై పోలీసులు విచారించారు. కేవలం అబుఅల్‌బరా ఆహ్వానం మేరకు సిరియాకు వెళ్లేందుకు మొయినుద్దీన్‌ సిద్దమయ్యాడా..? అంటే అదికూడ నిజం కాదని తెలుస్తోంది. కరుడు గట్టిన ఇస్లామిక్ తీవ్రవాదిగా తనకు తాను ముందుగా కఠోర శిక్షణ పోంది.. భారత్ కు తిరిగివచ్చిన తరువాత సొంతంగా దేశంలో జిహాద్ ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక సల్మాన్ లో వున్నాడని తెలుస్తోంది.  తన ప్రేయసి నిక్కి జోసెఫ్ అలియాస్ నిక్కి నికోలా అలియాస్ అయిషాతో పాటు తాను మారుపేర్లతో 2500 మంది యువకులకు ఉగ్రవాద పాఠాలు బోధించినట్లు సమాచారం. తాజాగా పోలీసుల విచారణలో మరెన్ని విషయాలను సల్మాన్ బయటపెడతాడో వేచి చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman moinuddin  police custody  Jihad in India  isis  

Other Articles