Mujahideen sleeper cells alert karnataka police

Indian Mujahideen, banned terrorist group IM, indian mujahideen sleeper cells, Im sleeper cells, Im sleeper cells in karnataka, IS sympathiser Mehdi Masroor Biswas, Hyderabad techie Salman Moinuddin, karnataka police become vigilant, Hubballi, Belagavi, Mangaluru, Mysuru towns, Im targeted 4 cities,

Indian Mujahideen sleeper cells in four cities of karnataka.. Karnataka police forces say efforts are on to identify terror recruits

కర్ణాటకలో ఐఎం స్లీపర్ సెల్స్.. పోలీసులు అప్రమత్తం..

Posted: 01/22/2015 08:55 AM IST
Mujahideen sleeper cells alert karnataka police

భారత నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ దేశంలో పెను విధ్వంస రచనకు కుట్రలు పన్నిందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కర్ణాటకలో ఇప్పటికే ఈ ఉగ్రవాద సంస్థ స్లీపర్ సెల్స్ ను వినియోగించుకుని విధ్వంస రచనకు కుయుక్తులు పన్ననట్లు సమాచారం. ఇటీవల కర్ణాటకలోని బెంగుళూరులో జరిగిన బాంబు దాడిలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించడంతో.. ఈ మేరకు వారు తెలిపారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

కర్ణాటక నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించేందుకు.. దేశంలో భయోత్సాప దాడులకు పాల్పడేందుకు విధ్వంస రచన చేస్తున్నారని కూడా పసిగట్టాయి. ఇందుకు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ  స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేసుకుందని కూడా సమాచారం అందించాయి. దీంతో కర్ణాటకా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల బాంబు పేలుడు ఘటనలో అనుమానితులుగా వున్న ఐదుగురిని విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారని నిఘావర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హుబ్బాలి, బెలగావి, మంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఇండియన్ ముజాహిద్దీన్ స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేసుకుందని సమాచారం.

అయితే స్లీపర్ సెల్స్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కర్ణాటకలోని నాలుగు పట్టణ ప్రాంతాల్లో వున్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు. అయితే స్లీపర్ సెల్స్ కేవలం అవసరమైన సమయంలోనే వారికి అందే అదేశాల మేరకు తెరమీదకు వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని పోలీసులు అంటున్నారు. అప్పటి వరకు వారు నిద్రాణంగా మాత్రమే ఉంటారని అందువల్ల వారిని గుర్తించడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్న నలుగురు నిందితులకు వారితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని కూడా తెలిపినట్లు సమాచారం. స్లీపర్ సెల్స్ నియామాకాలను మరో మార్గంలోనే, లేక కొత్త పద్దతిలోనే చేపట్టివుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో స్లీపర్ సెల్స్ వున్నాయన్న ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు  చర్యలు తీసుకుంటున్నారు.  హుబ్బాలి, బెలగావి, మంగళూరు, మైసూరు పట్టణ ప్రాంతల్లో అణువణువూ గాలిస్తున్నారు. అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నాలుగు నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిఘాను పెంచారు.

ఇక మరోవైపు ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరుడు మెహదీ మన్సూర్ బిస్వాస్ అరెస్టు అయిన తరువాత బెంగుళూరు  పోలీసులు హైదరాబాద్ సాప్ట్ వేర్ ఇంజనీర్ సల్మాన్ మెయినుద్దీన్ తో నిత్యం అందుబాటులో వుండేవారని బెంగుళూరు పోలీసులు తేల్యారు. మెయినుద్దీన్ స్వచ్చందంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యేందుకు మెహదీయే కారణంగా మారడని తెలిపారు. మెహదీ ట్విట్టర్ అకౌంట్ ను మెయినుద్దీన్ ప్రతీ రోజు ఫాలో అయ్యేవాడని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ త్రీవవాదంపై మహదీ చాలా తీవ్రంగా స్పందించాడని, అదికూడా సల్మాన్ ను ప్రభావితం చేసిందని పోలీసులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Mujahideen  sleeper cells  karnataka  

Other Articles