Election commission says trs still a defaulter party

TRS Party, TRS party latest, TRS defauter party, trs a defaulter party, defaulter party meaning, default party telugu meaning, election commssion on trs, trs latest news, telangana updates, telangana news

Election Commission says TRS Still a Defaulter party : EC Announces Telangana Rashtra Samiti as a defaulter party. trs not given election expenditure details to EC so commission announces party as defaulter

టీఆర్ఎస్ ‘అపరాధి’గా గుర్తింపు

Posted: 01/19/2015 10:31 AM IST
Election commission says trs still a defaulter party

అధికార పార్టీ అంటే మిగతా పార్టీలకు ఆదర్శంగా ఉండాలి కానీ.., తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అపరాద పార్టీగా మిగతావారిచే విమర్శలు ఎదుర్కుంటోంది. ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ను అపరాధ పార్టీగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు లెక్కలు చూపించలేదు. దీతో ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో పార్టీని ఇంకా డిఫాల్టర్ గానే చూపిస్తున్నారు. తమకు ఆదాయ వ్యయాల లెక్కలు ఇవ్వనందున పార్టీని డిపాల్టర్ గానే గుర్తిస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఖర్చుల లెక్కలను ఎప్పుడో ఈసీకి పంపించామని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

అపరాధ (డిఫాల్టర్) పార్టీ అంటే....?
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రతి పార్టీ కూడా ఆదాయ వ్యయాల వివారలను ఎన్నికల కమిషన్ కు అందించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్ణీత గడువు లోపు లెక్కలను ఈసీకి అందించాలి. లోక్ సభ ఎన్నికలు అయితే 90 రోజుల్లో, అసెంబ్లీ ఎన్నికలు అయితే 75 రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటంది. లెక్కలు చూపించని పార్టీలను వివరాలు కోరుతూ ఈసీ నోటీసులు పంపుతుంది. అయినా సరే స్పందించకుంటే, సదరు పార్టీని ‘డిఫాల్టర్(అపరాధి)’గా గుర్తిస్తూ ప్రకటన విడుదల చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Election commission  Defaulter party  

Other Articles