Tdp mla prakash goud demands to join in trs

MLA Prakash Goud, TDP MLA Prakash Goud, MLA Prakash Goud Joins TRS, Prakash Goud latest comments, TDP MLA's joins TRS, Telangana Updates, Prakash Goud biograpby, MLA Prakash Goud TRS, Telangana latest

TDP MLA Prakash Goud Demands to join in TRS : TDP MLA Prakash Goud asks many funds for his constituency development. Prakash Goud ready to join in TRS If kcr gives Rupees 350 Crores for Rajendra Nagar

కేసీఆర్ ఆపరేషన్ కు పరేషాన్

Posted: 01/19/2015 10:07 AM IST
Tdp mla prakash goud demands to join in trs

ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు చాలావరకు ఫలిస్తున్నాయి. సైకిల్ నేతలు కారు ఎక్కేందుకు తహతహలాడుతున్నారు. అయితే తమ కోరికలు తీరిస్తేనే కారు ఎక్కుతామని బెట్టు చేస్తున్నారు. కొందరు నేతలు చెప్పే కోరిక చిట్టా మంచి ఆఫర్ అన్పిస్తే.., ఇంకొందరు ఇచ్చే చిట్టా సీఎంకు సవాల్ గా మారుతుంది. తాజాగా టీడీపీ నేత, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కేసీఆర్ కు పెద్ద చిట్టానే ఇచ్చారు.

టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన పెట్టిన షరతులు చూస్తే.. రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.350 కోట్ల నిధులు కేటాయించాలి. ప్రతి ఇంటికీ మంజీరా నీటిని సరఫరా చేయాలి. వీటితో పాటు ఇతర చిన్న హామిలు ఉన్నాయి. ఇవి తీరుస్తే తెరాసలో చేరేందుకు ఏ అభ్యంతరం లేదని ప్రకాష్ గౌడ్ అంటున్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా కేసీఆర్ కు చెప్పానన్నారు. కాబట్టి ఇప్పుడు బంతి కేసీఆర్ కోర్టులో ఉంది.., కోరికలు తీరిస్తే సైకిల్ ఎమ్మెల్యే కారు ఎక్కుతాడు. లేదంటే సవారీని కొనసాగిస్తాడు. మరిప్పుడు సీఎం ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Goud  TRS Party  Telangana updates  

Other Articles