Shashi tharoor may be questioned soon says police commissioner

shashi tharoor, parliament member shashi tharooe, MP shashi tharoor, tharoor questioned soon, delhi police commissioner, basi, Journalist Nalini Singh, former Union Minister Shashi Tharoor, Sunanda Pushkar, tharoor's wife pushkar, tharoor and mehr relationship, Pakistani journalist Mehr Tarar.

Journalist Nalini Singh has revealed that Congress MP and former Union Minister Shashi Tharoor's deceased wife Sunanda Pushkar was upset about the relations between him and Pakistani journalist Mehr Tarar.

శశీథరూర్, తరార్ లను త్వరలోనే ప్రశ్నిస్తాం

Posted: 01/12/2015 09:45 PM IST
Shashi tharoor may be questioned soon says police commissioner

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వివాహేతర సంబంధాల గురించి ఆయన భార్య సునంద్ పుష్కర్ తీవ్రంగా కలత చెందేవారని ప్రముఖ జర్నలిస్టు నళినీ సింగ్ చెప్పారు. సునంద మరణించేముందు... శశి థరూర్, పాకిస్థాన్ జర్నలిస్టు మెహ్ర్ తరార్ల మధ్య సంబంధాల గురించి ఆందోళన చెందారని నళిని తెలిపారు. 2013 జూన్లో థరూర్, తరార్ కలసి దుబాయ్లో మూడు రాత్రులు ఉన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సునంద చెప్పారని నళిని వెల్లడించారు. శశి థరూర్ విడాకులు ఇస్తారని సునంద భయపడ్డారని నళిని చెప్పారు.

గతేడాది జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద మరణించారు. సునంద స్నేహితురాలైన నళిని మూడు రోజుల తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. సునంద చనిపోవడానికి ముందు రోజు తనకు ఫోన్ చేసిందని.. థరూర్, తరార్ పరస్పరం రొమాంటిక్ మెసేజ్లు పెట్టడం సునంద గుర్తించారని నళిని చెప్పారు. ఐపీఎల్లో థరూర్ అక్రమాల గురించి కూడా సునంద తనకు చెప్పినట్టు తెలిపారు. సునంద బ్లాక్బెర్రి మొబైల్ ఫోన్ నుంచి బీబీఎం మెసేజ్లను థరూర్ తొలగించారని, వాటిని మళ్లీ పొందేందుకు సాయం చేయాల్సిందిగా తనను కోరిందని వెల్లడించారు. శశి థరూర్కు అంతకుముందు మరో మహిళతో కూడా సంబంధం ఉన్నట్టు సునంద తెలిపారని నళిని చెప్పారు.

శశి థరూర్ వివాహేతర సంబంధాలు, ఐపీఎల్ అక్రమాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం.. ఈ నేపథ్యంలో సునంద హత్యకు గురికావడం అనేక సందేహాలకు తావిస్తోంది. వాస్తవం ఏమిటన్నది పోలీసుల విచారణలో వెల్లడికావాల్సివుంది. ఆదివారం శశి థరూర్  కేరళ నుంచి ఢిల్లీ వచ్చారు. సునంద హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను ఎప్పుడు విచారిస్తారన్న విషయం తెలియరాలేదు. కాగా నళిని ఆరోపణలను తరార్ ఖండించారు. సునంద హత్య కేసులో పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు.

శశిథరూర్ ను త్వరలోనే ప్రశ్నిస్తాం

సునందా పుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను త్వరలోనే ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. థరూర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, తమ సిట్ బృందం ఈ కేసు దర్యాప్తు సంగతి చూస్తోందని ఆయన అన్నారు. వాళ్లకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు త్వరలోనే థరూర్ను విచారణకు పిలుస్తారని చెప్పారు. కేరళలో కొంతకాలం పాటు ఆయుర్వేద చికిత్స పొందిన శశి థరూర్.. నిన్నేతిరిగి ఢిల్లీ చేరుకున్నారు. థరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ మధ్య గొడవకు కారణమని చెబుతున్న పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ను కూడా అవసరమైతే ప్రశ్నిస్తామని కమిషనర్ బస్సి చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunanda pushkar  shashi tharoor  sunanda pushkar death  nalini singh  mehr tarar  

Other Articles