Divers retrieve airasia black box explosion theory questioned

Air asia flight black box, Divers retrieve AirAsia black box, Indonesian navy divers retrieve black box, flight data recorder, AirAsia passenger jet, cause of airasia flight crash, flight killed 162 passengers, Air Asia flight QZ8501, final moments of airasia flight,

Indonesian navy divers retrieved the black box flight data recorder from the wreck of an Air Asia passenger jet on Monday, a major step towards unraveling the cause of the crash that killed all 162 people on board.

ఎయిర్ ఏషియా విమానం ప్రమాదం ఏలా జరిగింది..?

Posted: 01/12/2015 09:21 PM IST
Divers retrieve airasia black box explosion theory questioned

జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం కుప్పకూలాడానికి కారణాలు ఏంటి. తప్పు ఫైలెట్ దా..? లేక విమానాశ్రయ ఏటీసీ సిబ్బందిదా..? అన్న విషయాలు త్వరలో తేలిపోనున్నాయి. 162 మంద ప్రయాణికుల అకాల మరణానికి సంబంధించిన మిస్టరీ వెనుక కారణాలు ఏంటన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. యావత్ ప్రపంచ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకునేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. వివరాలను తెలుసుకునే పనిలో పడ్డింది ఇండోనేషియా ప్రభుత్వం.

ఎయిర్ ఏషియా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ నిమిత్తం పంపినట్లు సార్ (ఎస్ఏఆర్) ఆపరేషన్స్ డైరెక్టర్ సుప్రియాది తెలిపారు. జాతీయ రవాణా భద్రతా కమిటీ చీఫ్ ద్వారా సమాచారం అందిందని, బ్లాక్ బాక్స్ తన చుట్టూ 20 మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుందని ఆయన చెప్పారు.

బ్లాకు బాక్సులో డాటా రికార్డర్, వాయిస్ రికార్డర్ అనే రెండు విభాగాలు ఉంటాయి. బాక్సుల బ్యాటరీల్లో 30 రోజుల వరకు సమాచారం నిల్వ ఉంటుంది. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి. కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు.  విమానంలో ఉన్న మొత్తం 162 మంది ప్రయాణికుల్లో ఇంతవరకు 48 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు ఇండొనేషియా రవాణా మంత్రి ఇగ్నేసియస్ జోనన్ నిధులను కేటాయించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air asia flight  java sea  block box  flight data recorder  

Other Articles