Reliance will invest rs 1 lakh crore in gujarat says mukesh ambani at vibrant india summit

reliance invests rs 1 lakh crore in gujarat, reliance chairman mukesh ambani, gujarat vibrant india summit, vibrant india summit 2015, investment of lakh crores, Mukesh ambani, Relaince,

reliance will invest rs 1 lakh crore in gujarat says mukesh ambani at vibrant india summit

గుజరాత్ లో లక్ష కోట్ల పెట్టుబడులకు సుముఖం

Posted: 01/11/2015 06:33 PM IST
Reliance will invest rs 1 lakh crore in gujarat says mukesh ambani at vibrant india summit

గుజరాత్ రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఆదివారం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ...  ప్రపంచంలో అత్యం వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం బారత్ అని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సదస్సులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా... భారత్ కు మరింత బలం చేకూరుస్తున్నాయని మఖేశ్ అంబానీ తెలిపారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, ఐరాస అధ్యక్షుడు బాన్ కీ మూన్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2003లో వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సును అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాటి నుంచి ఆ సదస్సు ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Ambani  Reliance  Vibrant India Summit  invest Rs. 1 lakh crore  

Other Articles