Tragedy in anathapuram as rtc bus falls into gorge

tragedy in anathapuram, 1o killed as RTC bus falls into gorge, tragedy in madakashira, road accident in anathapuram, road accident in madakashira, Ap cm chandrababu, ap minister paritala sunitha, ap minster shidda raghava rao, ap minister palle raghunath reddy, 10 school children dead in tragedy, 13 injured in tragedy,

At least 10 people, many of them students were killed when a state-run bus fell into a 30-feet gorge near Penukonda in Andhra Pradesh on Wednesday.

‘అనంత’ విషాదం.. రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి

Posted: 01/07/2015 09:23 AM IST
Tragedy in anathapuram as rtc bus falls into gorge

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ, మడకశిర మార్గంలో బుధవారం ఉదయం  పల్లె వెలుగు ఆర్టీసీ  బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు మడకశిర నుంచి పెనుకొండ వెళుతుండగా మలుపు తిరిగే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు పక్కనే వున్న 20 అడుగుల లోతు వున్న లోయలో పడింది. పెనుకొండకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో అధికంగా స్కూలు విద్యార్థులు వున్నట్లు తెలుస్తుంది.

Bus-Accident-0
Bus-Accident-1
Bus-Accident-2
Bus-Accident-3
Bus-Accident-4
Bus-Accident-5
Bus-Accident-6
Bus-Accident-7
Bus-Accident-8

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఓ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. వీరిలో అధికంగా విద్యార్థులే వున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా బస్సు ప్రమాద సమాచారం అందగానే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునితా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అమెతో పాటు మంత్రులు శిద్దా రాఘవరావు, పల్లె రఘునాథరెడ్డిలో కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raod accident  eight killed  palle velugu bus  several injured  

Other Articles