Deceased mother accuse swamy nityananda for daughter s death

Controversial self-styled god-man Swami Nityananda, nityananda disciple ranjitha, case booked on nityananada and ranjitha, nityananda again in trouble, nityananda benguluru bididhi aashram, benguluru ramnagar police station, deceased mother accuses nityananda for her daughter death, nityananda disciple sangeeta, bididhi aashram computer head sangeeta

Controversial self-styled god-man Swami Nityananda is in trouble again as the mother of Sangeeta, a devotee at his ashram who died on December 28, has alleged that her daughter was being harassed by Nityananda and others in the ashram.

నిత్యానంద, రంజితలపై మరో కేసు నమోదు..

Posted: 01/07/2015 09:20 AM IST
Deceased mother accuse swamy nityananda for daughter s death

వివాదాస్పత స్వామీజీగా పేరోందిన స్వామి నిత్యానంద, ఆయన అందాల శిష్యురాలు సినీనటి రంజతలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నిత్యానంద ఆశ్రమంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆశ్రమ కంప్యూటర్ ఇంచార్జ్ సంగీత సంఘటనలో నిత్యానంద, రంజితపైల ప్రమేయం వుందని ఆరోపణలు వెల్లువెత్తడంతో నిత్యానంద, రంజితలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం బెంగళూరులోని బిడిది ఆశ్రమంలో తమిళనాడు తిరుచ్చికి చెందిన సంగీత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తమ కూతురు మృతికి నిత్యానంద, రంజితలే కారణమంటూ మృతురాలి తల్లి ఝాన్సీరాణి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడంతో నిత్యానంద రంజితలకు చిక్కులు వచ్చిపడ్డాయి.

తిరుచ్చికి చెందిన ఝాన్సీరాణి, సంగీత తల్లీకూతుళ్లు. వీరిరువురూ నిత్యానంద ఆశ్రమంలో సేవలు అందిస్తున్నారు. ఐతే ఝాన్సీ రాణికి మరోచోట ఉద్యోగం రావడంతో ఆమె వెళ్లిపోయింది. సంగీత అక్కడే ఉంటూ సేవలందిస్తోంది. డిసెంబరు 28న సంగీత మరణించిందని ఆశ్రమం నుంచి కబురు రావడంతో ఝాన్సీ అక్కడికి వెళ్లింది. పోస్టుమార్టం ముగిసిన అనంతరం కూతురు శవాన్ని తల్లికి అప్పగించడంతో ఆమె తిరుచ్చిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో కూతురు శరీరంపై గాయాలను చూసి షాక్ తిన్న ఝాన్సీ తమ శవానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలనీ, తన కుమార్తెను హత్య గావింపబడిందన్న అనుమానాన్ని వెలిబుచ్చింది. దీనికి కారణం నిత్యానంద, రంజితలేనంటూ బెంగుళూరు రామ్ నగర్  పోలీసులను ఆశ్రయించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swami Nityananda  disciple death  police complaint  

Other Articles