Congress mp gutta sukhendar reddy condemns join to bjp

congress mp gutta sukhendar reddy, gutta condemns joining bjp, gutta says its just like betraying mother, Nalgonda MP gutta sukhendar reddy, gutta criticeses telangana government,

congress mp gutta sukhendar reddy condemns join to bjp, he says its just like betraying mother

పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లేనా..? గుత్తా..!

Posted: 01/02/2015 03:38 PM IST
Congress mp gutta sukhendar reddy condemns join to bjp

బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. పార్టీ మారడమంటే తల్లికి ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు. గతంలో ఇలాగే పార్టీలు మారినవారు కాలగర్భంలో కలిసిపోయారని గుత్తా వ్యాఖ్యానించారు. అధికారుల బదిలీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారని గుత్తా ఆరోపించారు. వాటర్ గ్రిడ్లు కుంభకోణాలకు దారి తీస్తాయని ఆయన విమర్శించారు. పైప్లైన్ల కంపెనీలను పోషించేందుకే వాటర్ గ్రిడ్ పథకం అని గుత్తా అన్నారు. స్కామ్ల కోసమే దగ్గర నీటిని వదిలి...వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ అసలు చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న గుత్తా.. పార్టీ మారేందుకు నిరాకరిస్తున్నారు. అంతేకాదు తల్లికి ద్రోహం చేసినట్లేనన్న వాఖ్యాల నేపథ్యంలో ఆయనపై తెలంగాణ టీడీపీ వర్గాలు టార్గెట్ చేస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన టీడీపీని విడినప్పుడు ఇలాంటి ఎందుకు అనిపించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారిన నేతలు ఫిరాయింపులకు పాల్పడిన నేతలు పార్టీ మారితే తల్లికి ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించడం దయ్యాలు వేదలు వల్లించినట్లుగా వుందంటూ మండిపడుతున్నారు. 1999లో టీడీపీ తరపున గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా వ్యవహరించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

2009 నుంచి వరుసగా రెండు పర్యాయాలు నల్గోండ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికైనా ఒక్కటే పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకోవడంపై కాంగ్రెస్ నేతల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. పార్టీకి చెందిన నేతలు నేతలు పార్టీని విడీపోతుండటం బాధ కలిగిస్తుందని ఆయన పేర్కొన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటులో కేవలం రెండెంకలకే పార్టీ పరిమితమైనప్పటికీ.. పార్టీ పట్ల బాధ్యతగా ముందుకు వెళ్లడం పట్ల కాంగ్రెస్ నేతలు గుత్తను ప్రశంసిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gutta Sukhendar Reddy  BJP  Congress  MP  

Other Articles