Customs men find 1kg of gold in flyer s belly in hyderabad

customs officers, customs seized gold, customs seized items, customs seized the gold in stomach, one man gold in atomach

Shamshabad international airport wearing one kilogram of gold reportedly ... African man, carrying cocaine capsules in stomach, arrested at hyderabad

వాడి తెలివి సినిమా తెలివి..!!

Posted: 12/27/2014 10:47 AM IST
Customs men find 1kg of gold in flyer s belly in hyderabad

ఎదో ఒక సినిమాలో హీరో స్మగ్లింగ్ చేస్తూ వాటిని ఎలా అక్రమంగా తీసుకురావాలో ఆలోచించి చివరకు ఆ స్మగ్లింగ్ వస్తువులను మింగేసి కడుపు లో దాచేసి విజయవంతంగా తను అనుకున్న లక్ష్యానికి చేర్చి అక్కడ ఆపరేషన్ చేసి బయటకు తీసి అందజేయాల్సిన వాళ్ళకి అందజేస్తాడు... ఇది సినిమా. మరి రియాలిటీ ఏమో... సరిగ్గా ఇలాంటి సంఘటనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి ఒక వ్యక్తి తన పొట్టలో బంగారాన్ని దాచుకుని వచ్చాడు, కస్టమ్స్ అదికారులకు అనుమానం వచ్చి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని సోదా చేశారు. కాని ఏమి లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం తీరక వెంటనే అతన్ని మల్లి ఒకసారి తానికి చేశారు. ఎలా పట్టారో, ఏ విధంగా కనిపెట్టారో కాని అతని పొట్టలో కిలోల కొద్ది బంగారం ఉన్నట్లు కనిపెట్టేశారు. ఇంకేముందు వెంటనే తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఆ బంగారాన్నంతా బయటకి తీశారు.

ఆ బంగారాన్ని చూసిన కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు... ఇంత బంగారాన్ని వీడు పొట్టలో పెట్టి ఎలా భరించడా అని. మలేషియ రాజధాని నగరం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన అబ్దుల్లా అనే ఒక వ్యక్తి బంగారాన్ని గుళికల రూపంలోకి మార్చి పొట్టలో దాచాడట. హైదరాబాద్ కస్టమ్స్ అదికారులు అతనిని పట్టుకోగలిగారు.350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారట. పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : customs officers  gold  shamshabad airport  

Other Articles