Jarkhand assembly eletion counting latest update

jarkhand elections counting latest update, jarkhand assembly elections latest update, jarkhand elections jmm party leading, jarkhand assembly elections bjp leading latest updates, jarkhand assembly elections jvm party latest updates, jarkhand assembly elections party wise leading updates, jammu kashmir elections result latest updates

jarkhand eletion counting latest update : 14 years old jarkhand sets to form a new government with latest updates state is going to ruled by bharatiya janata party, jmm and congres paty losses its place in state

మ్యాజిక్ ఫిగర్ దగ్లర్లో బీజేపీ.., మోడి మ్యానియా మహిమ

Posted: 12/23/2014 10:24 AM IST
Jarkhand assembly eletion counting latest update

సార్వత్రిక ఎన్నికలు ముగిసినా మోడీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇది నిజమని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే బీజేపీ దూసుకెళ్తోంది. ప్రతి రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్ధులు ఆధిక్యతను కనబరుస్తున్నారు. రాష్ర్టంలో అధికార పక్ష హవా నేపథ్యంలో ఏ.ఎస్.జే.యూ తో కలిసి పోటి చేసింది. రాష్ర్టాన్ని  ఏర్పాటు చేసిన తమకే.., సుపరిపాలన అందించే సత్తా ఉందని చేసిన ప్రచారం బాగా పనిచేసిందని విశ్లేషకులు చెప్తున్నారు.

రాష్ర్టం ఏర్పడి 14 సంవత్సరాలు అవుతుండగా ఇప్పటివరకు 9 ప్రభుత్వాలు మారాయి. దీంతో విసుగెత్తిపోయిన ప్రజలు, సుస్థిర ప్రభుత్వం కోసమే బీజేపిని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలవారి లీడ్ చూస్తే.., 38 చోట్ల ఆదిక్యంతో బీజేపి తొలి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఉన్న జేఎంఎం 23 స్థానాలు, కాంగ్రెస్ 08 స్థానాలతో మూడవ ప్లేస్ కు పరిమితం అయితే.., 05 స్థానాలతో జేవీఎం నాల్గవ ప్లేస్ లో ఉంది. అధికార పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 42కు దగ్గర్లో బీజేపి ఉంది. ప్రధాన అభ్యర్ధుల వారిగా చూస్తే జేఎంఎం నేత, సీఎం హేమంత్ సొరెన్ వెనకంజలో ఉన్నారు. ఆయనతో పాటు మాజీ సీఎం మధుకొడా కూడా వెనకబడ్డారు. అటు బీజేపీ నేత జార్ఖండ్ మాజి ముఖ్యమంత్రి అర్జున్ ముండా కూడా ఫలితాలవారిగా వీక్ గా ఉన్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jarkhand assembly elections  bjp jarkhand latest  jammu kashmir result  

Other Articles