Botsa satyanarayana likely to join bjp confirmed

botsa sathyanarayana, bjp party, bjp party andhra pradesh, bjp president hari babu, bjp, amit shaa, telangana bjp

Botsa to join BJP,Botsa Satyanarayana to join BJP,botsa planning to join BJP

ఈ వారమే కమలం గూటికి బొత్స

Posted: 12/23/2014 10:12 AM IST
Botsa satyanarayana likely to join bjp confirmed

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన వ్యక్తి... కాంగ్రెస్ లో కీలక నేత, ఆయనే రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన బిజెపి పార్టీ లో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన అనుచరవర్గంతో ఇప్పటికే పలు మార్లు భేటి అయ్యారు. అందరి బిజెపి లో చేరిక పట్ల ఆసక్తి గానే ఉన్న్నట్లు తెలుస్తుంది. ఇంక ఆయన బిజెపిలో చేరడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. దీనికి సంబంధించి వస్తున్న కధనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మద్య బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు విజయనగరం వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను బిజెపిలో చేర్చుకోవడానికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దాంతో బిజెపి లో బొత్స ను చేర్చుకునేది ఖరారు అయ్యిందని పార్టీ కార్యకర్తలకు కూడా అర్ధమయ్యింది. బొత్స ను కూడా చేర్చుకుంటారా అని అడిగితే సానుకూలంగా స్పందించారు. దానిని బట్టి బొత్స తన వర్గంతో కలిసి బిజెపిలో చేరడానికి సిద్దమవుతున్నారని అంటున్నారు. లక్ష మంది తో సభ నిర్వహించి బొత్స తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స చేరిక పట్ల బిజెపి పార్టీ అగ్రనాయకత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. బొత్స ఢిల్లీ లో బిజెపి అగ్ర నాయకత్వాన్ని కూడా కలిసినట్లు ప్రచారం జరుగుతుంది

అదే సమయంలో బొత్సను బిజెపిలోకి రాకుండా చూడడానికి టిడిపి ప్రయత్నిస్తున్నదని కూడా ప్రచారం జరుగుతోంది.ఇందులో బాగంగానే సహకార రుణాల కుంభకోణంపై మరోసారి విచారణకు టిడిపి ప్రభుత్వం ఆదేశించిందని చెబుతున్నారు.కాగా బిజెపి అద్యక్షుడు అమిత్ షా కూడా బొత్స సత్యనారాయణ చేరికపట్ల ఆసక్తిగా ఉన్నారని కూడా అంటున్నారు.కాపు వర్గానికి సంబంధించిన వారిని ఆకట్టుకోవడం లక్ష్యంగా బొత్సను బిజెపిలో చేర్చుకుంటున్నారని అంటున్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : botsa sathyanarayana  bjp party  amit sha  

Other Articles