Jammu kashmir jarkhand election counting

jammu kashmir election counting result, jammu kashmir election result updates, jammu kashmir vote counting, jammu kashmir political partywise mla list, jarkhand election result, jarkhand party wise election winners list, jarkhand latest updates, latest telugu news

jammu kashmir jarkhand election counting : india and world waiting for jammu kashmir election result as per the exit poll opinion upper state may get hung and recently formed one may get bjp party ruling

రెండు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు, ఫలితం కోసం చూస్తున్న పాక్

Posted: 12/23/2014 07:31 AM IST
Jammu kashmir jarkhand election counting

దశల వారిగా జరిగిన జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. ఎనమిది గంటల నుంచి ప్రారంభం అవుతున్న కౌంటింగ్ లో 9గంటల నుంచి అభ్యర్ధుల ఆధిక్యత తెలియనుంది. జమ్మూలోని 87 స్థానాల్లో పోలింగ్ జరిగింది. గత పరిస్థితులకు పూర్తి భిన్నంగా.., ఉగ్రవాదులు, వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. అటు ఈ దఫా కాశ్మీరాన వికసించాలని చూస్తున్న కమలం ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

అటు కాశ్మీర్ ఫలితంపై భారత్ ఎంత ఆసక్తిగా ఎదరుచూస్తుందో.., అంతకంటే ఎక్కువగా పాక్ ఎదురుచూస్తోంది. కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని.., ఉపఖండంపై యుద్ధానికి సహకరిస్తామని నోటి దురుసును చూపిస్తున్న పాక్ నేతలు ప్రజలు ఏం కోరుకుంటున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిమప్రాంతంలో బీజేపి అధికారంలోకి వస్తే మాత్రం పాకిస్థాన్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని చెప్పాయి. ఓటరు నాడి ఏం ఫలితం ఇచ్చిందనేది కొద్ది గంటల్లో తెలియనుంది.

ఇక కొత్తగా ఏర్పడి మావో ప్రభావిత రాష్ర్టంగా మారిన జార్ఖండ్ లో కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 81 స్థానాలకు జరిగిన ఎన్నికలకు 66శాతం పోలింగ్ నమోదయింది. ప్రధాన పోటి జార్ఖండ్ ముక్తి మోర్చా, బీజేపీ-ఏజేఎస్.యూ. యూటమి మద్య ఉంది. 14 సంవత్సరాల్లో ఇప్పటివరకు 9 సార్లు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏ సర్కారు కూడా ప్రజలకు స్థిర పాలన అందించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ దఫా సుస్థిర పాలన అంటూ ప్రచారం చేసిన బీజపి ప్రజల్లో కొత్త ఆశలు రేపింది. ప్రజల మనోభావాలు గుర్తించి రాష్ర్టాన్ని ఇచ్చిన తమకే వారికి తగినట్లు పాలన అందించే సత్తా ఉందని కమల నేతలు చెప్పారు. ఈ ప్రచారానికి ఎక్కువ ఓట్లు పడి.., అధికారం చేపట్టే అవకాశం ఉందని అంచనా ఫలితాలు చెప్తున్నాయి. ఈ ఫలితాలు ఎలా ఉన్నా.., ఓటర్లు ఎవరికి పగ్గాలు అప్పగించనున్నాడు కొద్ది గంటల్లో తేలనుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu election result  jarkhand result updates  narendra modi  

Other Articles