Deadline to exchange pre 2005 currency notes ends on january 1 rbi announced

rbi policies, rbi press note, rbi recent news, rbi repo rate, rbi recent press note, pre 2005 currency, 2005 before currency, recognise before 2005 currency notes

People have only 9days left to exchange currency notes of various denominations, including 500 and 1,000, which were printed before 2005

నోట్లు మార్చాలి తొమ్మిది రోజుల్లో..!!

Posted: 12/23/2014 12:55 AM IST
Deadline to exchange pre 2005 currency notes ends on january 1 rbi announced

రిజర్వు బ్యాంకు చాలా రోజుల క్రితం ఒక ప్రకటన చేసింది.... 2005 సంవత్సరం కన్నా ముద్రించిన నోట్లను ప్రజలు తిరిగి మార్చుకోవాలని.., కొంత గడువు విధించి అప్పటి లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. కాని ఆ తర్వాత మళ్ళి ప్రజల విన్నపాన్ని దృష్టి లో పెట్టుకొని గడువు తేదిని పొడగించింది. ఇప్పుడు ఆ గడువు తేది సమీపిస్తుంది. 2005 సంవత్సరం కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకోవటానికి ప్రజలకు ఇంక 9 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 500, 1000 రూ కరెన్సీ నోట్లు సహా ఇతర నోట్లను మార్చుకునేందుకు జనవరి 1 2015 ను చివరి తేది గా రిజర్వు బ్యాంకు విధించింది. రిజర్వు బ్యాంకు నోట్లను మార్చుకోవాలని ప్రజలకు చెప్పినప్పటి నుండి 2005 సంవత్సరం కంటే ముందున్న నోట్లలో 52,855 కోట్ల విలువైన 144.66 కోట్ల కరెన్సీ నోట్లను ప్రజలు మార్పిడి చేసారని ఆర్ బి ఐ ద్వారా తెలుస్తుంది.

నకిలీ కరెన్సీ ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని, 2005 సంవత్సరం తర్వాత తయారైన నోట్లన్నీ భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని... కేంద్రీయ బ్యాంకు వెల్లడించింది. ఇంతకు ముందు ఈ నోట్లను మార్చుకోవాలని ఈ సంవత్సరం జనవరి 22 వ తేదిన రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 2005 కంటే ముందు ముద్రించిన నోట్లకు వెంక వైపు సంవత్సరం ముద్రించి ఉండదు. 2005 తర్వాత ముద్రించిన నోట్లకు నోట్ల వెనక వైపున క్రింది భాగం లో సంవత్సరం ముద్రించి ఉంటుంది. కనుక ప్రజలందరూ 2005 సంవత్సరం కంటే ముందున్న నోట్లు ఉన్నట్లయితే వెంటనే మార్పిడి చేసుకోవాల్సిందిగా సూచించింది.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reserve bank of india  9 days left  pre 2005 notes  

Other Articles