Dawood ibrahim saved by a phone call during indian commondos operation

dawood ibrahim, dawood ibrahim crime news, dawood ibrahim operation, indian commondos, 1993 mumbai bombs incident, dawood ibrahim wikipedia, indian raw commondos operation

dawood ibrahim saved by a phone call during indian commondos operation

దావూద్’ని సజీవంగా వుంచింది ఆ ఒక్క ఫోన్’కాలే!

Posted: 12/15/2014 06:31 PM IST
Dawood ibrahim saved by a phone call during indian commondos operation

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం.. ఇప్పటివరకు భారత కమెండోల చేతికి చిక్కుండా గోప్యంగా తలదాచుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే! ఇతని కోసం ఎన్నో రహస్య బృందాలను ఏర్పాటు చేసిన ఎవరికీ తెలియకుండా ప్రత్యేకంగా ఆపరేషన్లు జరిపినప్పటికీ.. ఇతను చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఏడాది క్రితం మాత్రం చేతికి దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. ఒక సంవత్సరం క్రితం భారత కమెండోలు అత్యంత రహస్యమైన ఆపరేషన్ చేపట్టి, దాదాపు ఫలితం సాధించే దశలో ఆగిపోయింది. కానీ చివరి నిముషంలో ఓ ఫోన్ కాల్ కారణంగా ఆ ఆపరేషన్ ఆగిపోయింది. ఆ వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి....

2013 సెప్టెంబర్ 13వ తేదీన పాకిస్థాన్’లోని కరాచీ ప్రాంతంలో క్లిప్టన్ రోడ్ నుంచి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ వైపు ఓ కారు దూసుకెళుతోంది. ఆ దారిలోనే వున్న ఓ దర్గా వద్ద 9 మంది భారతీయ కమాండోలు తమ ఆయుధాలతో పొజిషన్’లో వున్నారు. కేవలం అర లేదా ఒక నిముషం గడిస్తే చాలు.. ఆ కారులో వున్న వ్యక్తి అందులోనే ఖతమయ్యేవాడు.. కానీ అంతలోనే ఆ కమాండోలలోని ఒకరి మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. ఈ సమయంలో ఎవర్రాబాబు అని చిరాగ్గా లిఫ్ట్ చేస్తే.. ‘‘ఆపరేషన్ ఆపేయండి.. ఆ వ్యక్తిని వదిలేయండి’’ అని ఓ ఆదేశం అందులో వినిపించింది. అంతే.. అహర్నిశలు కష్టపడి రూపొందించుకున్న ఆ ఆఫరేషన్ క్షణాల్లో నిష్ఫలమైంది. కానీ.. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో ఇంకా తెలియరాలేదు.

ఇంతకీ ఆ కారులో వున్నది మరెవ్వరో కాదు.. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం. సరిగ్గా 15 నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశ్వసనీయ వర్గాలు తాజాగా వెల్లడించాయి. గతంలో కూడా ఇతగాడిని పట్టుకోవడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నాలు జరిపారు కానీ.. ఆనాడు కొంతమంది సహాయంతో అతడు తప్పించుకోగలిగాడు. అయితే 2013 సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించిన ఆ ఆపరేషన్ కోసం ఎంతో కష్టాలు పడాల్సి వచ్చింది. అతడు ఎప్పుడు, ఎక్కడ నుంచి వస్తాడు..? అతడు ఎక్కడ నివసిస్తాడు..? అన్న వివరాలు సేకరించిన అనంతరం ఈ ఆపరేషన్’ను భారతీయ నిఘావర్గాలు ఎంతో పకడ్బందీగా నిర్వహించి, తొమ్మిది మంది ‘రా' కమాండోలను నియమించింది. వీరికి సూపర్‌బాయ్స్‌ అని నామకరణం చేశారు.

కరాచీలో ఉంటున్న దావూద్‌ ఇబ్రహీం ప్రతిరోజు క్లిప్టన్‌రోడ్‌లోని ఇంటి నుంచి డిఫెన్స్‌ హౌసింగ్‌ సొసైటీకి రాకపోకలు సాగిస్తాడు. దావూద్‌ కదలికలను పసిగట్టిన సూపర్‌బాయ్స్‌ ఈ రోడ్డే ఆపరేషన్‌కు అనువైనదిగా భావించారు. దావూద్‌ తాజా ఫొటోలను, వీడియోలను చూసి ఎలా ఉంటాడో ఖరారు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 13న ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఈ రోడ్డులోని దర్గా వద్ద తమ వెపన్స్‌తో పొజిషన్‌ తీసుకున్నారు. నిమిషంలోపే ఆపరేషన్‌ పూర్తవబోతోంది. షూట్‌ చేయడమే తరువాయి అనుకున్న సూపర్‌బాయ్స్‌లో ఒకరి మొబైల్‌కు అత్యంత కీలకమైన వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. కాల్పులు వద్దు, వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. చేసేది లేక మన కమెండోలు వెనక్కి వచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : dawood ibrahim  indian raw commodons  Intelligence sources operation  

Other Articles