Miss south africa rolene strauss crowned miss world 2014

Miss World 2014, the 64th edition of the Miss World pageant, Rolene Strauss of South Africa, the 2014 Miss World, Miss World finals are officially upon us, 2014 final of the Miss World contest, Miss World 2014 is Miss South Africa Rolene Strauss, Miss Hungary Edina Kulcsar named runner-up, London's ExCel hosts the 2014 final of the Miss World

The 64th edition of the Miss World pageant, was held on December 14, 2014, Rolene Strauss of South Africa was crowned Miss World 2014 on Sunday in London.

ప్రపంచ అందగత్తెగా "చీకటి ఖండపు" చక్కనమ్మ

Posted: 12/15/2014 01:57 PM IST
Miss south africa rolene strauss crowned miss world 2014

కాటుక దిద్దిన తన కనులు కరిగించెను నా మనసును...., తన అమాయకమైన చూపులు గుండెల్లో పుట్టించెను మెరుపులు... ఆమెను చూసినపుడు ప్రతి ఒక్కరి కవి హృదయం ఉప్పొంగుతుంది. ఆమె అందగత్తెలకే అందగత్తె.., ఆమె చిరుదరహాసం చిద్విలాసం... ఆమె చూపు అద్వితీయం, ఆమె అందం ఈ సృష్టికి చందం.., ఆమె వదనం కాలానికే కలలో కనిపించి కలవర పెడుతుంది..., మాటలకందని సోయగంతో ఈ మధ్యమాలోకుల మనసులను మురిపించి మైమరిపించింది.. ఈ రోజు "చీకటి ఖండపు చింకచూపులాడిగ" జగతి విఖ్యాతి గాంచిన దక్షిణాఫ్రికా అతివ ఈ అవనికే అతిలోక సుందరిగా ఎంపికయ్యింది. ఆమె మరెవరో కాదు ఆకాశం వరకు అందాల అలై ఎగసిన రోలిస్ స్ట్రాస్ (22 సంవత్సరాలు).

ఈ ఏటి ప్రపంచ సుందరిగా (మిస్ వరల్డ్) దక్షిణ ఆఫ్రికా సుందరరీమణి రోలిస్ స్ట్రాస్ ఎంపికయ్యింది. ఈ అద్భుతమైన ఘట్టానికి లండన్ లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రం సాక్షిగా నిలిచింది. కనుల పండగగా జరిగిన ఈ కార్యక్రమం లో ప్రపంచ అందగత్తెగా ఎంపికయిన రోలిస్ స్ట్రాస్ శిరస్సు పై గత సంవత్సరం ప్రపంచ సుందరి మేగస్ యాంగ్ కిరీటాన్ని అలంకరించారు. ప్రపంచ వ్యాప్తంగా 121 మంది అందగత్తెలతో పోటి పడి నెగ్గిన రోలిస్ స్ట్రాస్ ఒక వైద్య విద్యార్థిని. హంగేరి సౌందర్య సుందరి ఎడినా కుల్స్కార్ ద్వితీయ స్థానం లోను, అమెరికా సుందరి ఎలిజబెత్ సౌఫ్రిత్ తృతీయ స్థానం లోనూ నిలిచారు. భారత అందాల అప్సరస కోయల్ రాణాకు తొలి పది మంది లో చోటు దక్కింది. ఆమె ఉత్తమ డిజైనర్ టైటిల్ గెల్చుకున్నారు. మన దేశం చివరిసారిగా 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా., ప్రపంచ సుందరి కీరిటం గెల్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ను ఇదే వేదికపై ప్రత్యేక అవార్డు తో సత్కరించారు. 1994లో ఆమె ప్రపంచ సుందరిగా గెలిచిన విషయం విదితమే. అప్పటి నుండి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గాను ఈ అవార్డ్ అందజేశారు. ఈ పురస్కారం తీసుకోవటానికి ఆమె తన తల్లి వృందా రాయ్, కుమార్తె ఆరాధ్య, భర్త అభిషేక్ బచ్చన్ తో వచ్చి అక్కడ సందడి చేశారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles