Natural ayurvedic home remedies for diabetes

Treat diabetes by natural ayurveda, Natural Ayurveda Remedies for diabetes, Ayurvedic remedies for diabetes, treat diabetes using natural ingredients, diabetes controlled by ayurveda, home remedies for diabetes, how to control diabetes, how to control diabetes naturally

you can treat diabetes using natural ingredients available in your kitchen!

ITEMVIDEOS: మధుమేహ నివారణ, నియంత్రణకు అయుర్వేద చిట్కాలు

Posted: 12/15/2014 01:47 PM IST
Natural ayurvedic home remedies for diabetes

మధుమేహ వ్యాధి సోకిందంటే చాలు అనేక మంది తమ జీవితాలను కబళించే మహమ్మారి వచ్చిందంటూ భయపడుతుంటారు. మదుమేహ వ్యాధి పట్ల ఇతరులు, వైద్యుల చెప్పింది విని మనోవేధనకు గురవుతుంటారు. కానీ చిన్న వ్యాయామం, ప్రాణాయమంతో మధుమేహ వ్యాధిని నియంత్రణ, నివారణించవచ్చునని మీకు తెలుసా..? బాబా రాందేవ్ చూపిన 7 ప్రాణాయామాలను అచరిస్తే.. చక్కరి వ్యాధిని నుంచి తప్పించుకోవచ్చునని ఇటీవలే.. మీకు ఒక వీడియోను అందించాం.

దీంతో పాటు మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ కోసం వేలాధి రూపాయలను అలోపతి ఔషధాల కోసం వినియోగించకుండా.. ఇంట్లోనే దివ్వౌషదాన్ని తయారు చేసుకునే ప్రక్రియను మీకందిస్తున్నాం. శరీరానికి కావాలసిన ఎనర్జీని మనకు గ్లూకోస్ అందిస్తుంది. దీని ద్వార మనం దైనందిక చర్యలను చేసుకోగలుగుతున్నాం. అయితే మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తిని అందించే గ్లూకోస్.. శరీర శ్రమ తక్కువవ్వడంతో శరీరంలోనే పెరుకుపోతుంది. దీని ద్వారా సంక్రమించే వ్యాధే మదుమేహం.

అయితే శరీరం ఉత్పత్తి చేసే గ్లూకోస్ ను శరీర అవసరాలకు తగ్గట్లుగా పుంచడంతో జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి పాన్ క్రియాస్ విడుదల చేసే ఇన్సూలిన్ .. దోహదం చేస్తుంది. ఇన్సూలిన్ గ్లూకోస్ ను లివర్, కండరాలు, కొవ్వు పధార్థాలకు తీసుకెళ్తుంది. ఇన్సూలిన్ తగిన శాతంలో శరీరంలో లేకపోవడంతో గ్లూకోస్ పదార్థాలు శరీరంలో అధికస్థాయికి చేరుకుంటాయి. మధుమేహ వ్యాధి రెండు రకాలుగా వుంది. ఒకటో రకంలో శరీరం ఇన్సూలిన్ తగిన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం వల్ల వస్తుంది. ఇది సాదరణంగా పిల్లలు, యుక్తవయస్సులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

రెండవ రకంలో శరీరం ఇన్సులిన్ నిరోధకంగా తయరవ్వడం వల్ల వస్తుంది. వీరిలో ఇన్సూలిన్ ప్రభావం ఏ మాత్రం పనిచేయకుండా చేస్తుంది. ఈ తరహా మధుమేహ వ్యాధి గర్భణి స్త్రీలతో పాటు వృద్దాప్యం దశకు చేరుకున్న వారు, శరీరక శ్రమ ఎక్కువగా లేని వారిలో సంక్రమిస్తుంది. అయితే రెండో రకం చక్కర వ్యాధి వచ్చిన వారు దానిని తేలిగ్గానే నియంత్రివచ్చునని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇంట్లోనే మధుమేహ వ్యాధికి ఔషదాన్ని తయారు చేసుకుని నియంత్రించవచ్చు. మీ కోసం గృహ ఔషదాల తయారీ విధానాన్ని పరిచయం చేస్తున్నాం.

మొదటి చిట్కా: నాలుగైదు తాజా కాకరకాయల తీసుకుని వాటి తొక్కతో పాటు గింజలను తీసి వేరుచేయండి. వాటిని జ్యూస్ గా తయారు చేసి రోజు ఉదయం పరిగడుపున ( ఉదయాన్నే ఏమీ తీసుకోక ముందు) తీసుకోవాలి. ఇలా రోజు చేస్తే క్రమంగా మధుమేహ వ్యాధిని నియంత్రించి అదుపులో వుండేలా జాగ్రత్త పడవచ్చు. రెండవ చిట్కా: ఒక్క లీటరు తాగునీటిని ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మరగనివ్వాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు మూడు టీస్పూన్ దాల్చిన చెక్క పోడిని నీటిలో  వేసి బాగా కలపాలి. నీరు చల్లారిన తరువాత వాటిని ఒడబట్టి రోజుకు మూడు పర్యాయాలు ఈ నీటిని తీసుకోవాలి. మూడవ చిట్కా: నాలుగు టీ స్పూన్ ల మెంతులను పావు లీటరు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజ ఉదయాన్నే.. ఆ నీటిలేనో వాటిని మెత్తగా చూర్ణంలా చేయాలి. నీటిని ఒడబట్టిన తరువాత ప్రతి రోజు రెండు నెలల పాటు క్రమంగా తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు 8 నుంచి 10 నేరుడు పళ్లను తీసుకోవాలి. తీపి ఎక్కువగా వున్న అహారపదార్థాలను ముఖ్యంగా స్వీట్లుర, కేక్ లు తదితర జంక్ ఫుడ్ ను తీసుకోవడం మానివేయాలి. అంతే మధుమేహాన్ని నియంత్రలో పెట్టుకుని ఆరోగ్యంగా వుండవచ్చు.
    

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diabetes  Natural Ayurveda  Home Remedies  

Other Articles