Mala mahanadu activists protests at trs mla koppula eshwar

mala mahanadu demands ministry, mala mahanadu rejects chief vip, mala mahanadu demands ministry for Eshwar, mala mahanadu demands ministry for malas, mala mahanadu protest at koppula eshwar house, mala mahanadu demands Eshwar ministry, malas protest at Eshwar house, malas demand not to accept chief vip post

mala mahanadu leaders demand ministry for koppula eshwar instead of chief vip, protests in front of Eshwar's house in karimnagar

చీఫ్ గా చీఫ్ విప్పా..? మంత్రి పదవివ్వండి...

Posted: 12/14/2014 06:49 PM IST
Mala mahanadu activists protests at trs mla koppula eshwar

తెలంగాణ కేబినెట్లో తొలి విస్తరణలో స్థానం దక్కక పోయినా రెండోసారి విస్తరణలోనైనా చోటు దక్కుతుందని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భావించారు. కానీ సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో కొప్పుల ఈశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చీఫ్ విప్ పదవిని నిరాకరిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్... కేసీఆర్ సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ ను నమ్ముకుని వస్తే.. పునాదుల నుంచి పార్టీ కోసం పటిష్టంగా పనిచేస్త.. తనకే అన్యాయం జరుగుతుందని అన్నట్లు సమాచారం.

అయితే కొప్పుల ఈశ్వర్కు చీఫ్ విప్ పదవిని కేటాయించడంపై మాలమహానాడు కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చీఫ్ విప్ పదవి తీసుకోవద్దంటూ కరీంనగర్లోని కొప్పుల ఈశ్వర్ నివాసం వద్ద మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈశ్వర్కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి వద్దని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ విస్తరణలో కొప్పుల ఈశ్వర్ కు చోటు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాల వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈశ్వర్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాలలకు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని వారు హెచ్చరించారు.

టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని వచ్చిన నాయకులంతా చీలికలు, పేలికలుగా విడిపోయి.. ఎక్కడెక్కడో వున్నా.. పార్టీ అవిర్భావం నుంచి టీఆర్ఎస్ లో వున్నా నాయకులకు సరైన ప్రాతినిథ్యం దక్కడం లేదని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వెన్నంటి ఉన్న తమ నాయకుడు ఈశ్వర్కు చీఫ్ విప్ పదవి ఇచ్చి అన్యాయం చేయొద్దని వారు సీఎం కేసీఆర్కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కొప్పుల ఈశ్వర్ను కోరగా... అందుకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koppula eshwar  TRS MLA  dharmapuri mla  kcr cabinet  chief vip  

Other Articles