Agi music company owner files police complaint against ilayaraja

police case on ilayaraja, police complaint against ilayaraja, case on music director ilayaraja, songs stolen by ilayaraja, agi music company, agi music company director akhilan lakshman, chennai police commissioner, illayaraja, agi company agreement

agi music company owner files police complaint against ilayaraja alleges that his music is stolen

సంగీతాన్ని చౌర్యం చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్..?

Posted: 12/14/2014 06:09 PM IST
Agi music company owner files police complaint against ilayaraja

ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర మాంత్రికుడు ఇళయరాజాపై ఒక ఆడియో సంస్థ నిర్వాహకుడు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వివరా ల్లో కెళితే...ఇంతకుముందు ఇళయరాజా అభి మ్యూజిక్ సంస్థ తన పాటలను తస్కరిస్తోం దంటూ చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు బృందం దర్యాప్తుకు రంగంలోకి దిగింది. ఇదిలా ఉండ గా అ మ్యూజిక్ సంస్థ అధినేత అఖిలన్ లక్ష్మణ్ పోలీసు కమిషనర్‌కు ఇళయరాజాపై ఫిర్యాదుచేశారు. అందులో ఆయన పేర్కొంటూ ఇళయరాజా పాటలకు సంబంధించి 2007లో తమ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయితే దీని కాల పరిమితి పూర్తి కాకుండానే నిబంధనలు మీరి ఇళయరాజా వేరే ఆడియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

దీంతో తాను ఇళయరాజాపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఆ కేసు విచారణలో ఉండగానే ఆయన తమపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు హద్దుమీరి తమ కార్యాలయంలోకి ప్రవేశించారని ఆరోపించారు. ఈ కారణంగా తామే ఇతర చిత్రాల ఆడియో సీడీలను విక్రయించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చిన్న చిత్రాల ఆడియోలతోపాటు వర్ధమాన సంగీత దర్శకుల ఆడియోను విడుదల చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్న తమ సంస్థకు కళంకం ఏర్పడుతోందన్నారు. కొందరు అభిమానుల పేరుతో ఇంటర్‌నెట్ ద్వారా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని అఖిలన్ లక్ష్మణ్ పోలీసులను కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ilayaraja  music director  AGI Music Company  Police Complaint  

Other Articles