Actor and karnataka minister ambareesh picture of the actor turned politician kissing a girl was circulated on media

actor mabaressh, actor ambareesh assembly incident, ambareesh incident in assembly, ambareesh kissing a girl photo, ambareesh kissing pic leaked.

actor and minister ambareesh saw some videos condemned the act of Ambareesh using cellphone in the assembly.

నిన్న ఎం.ఎల్.ఏ.., ఈ రోజు మంత్రి....

Posted: 12/12/2014 10:56 AM IST
Actor and karnataka minister ambareesh picture of the actor turned politician kissing a girl was circulated on media

కర్ణాటక రాష్ట్ర రాజకీయం రోజుకో దుమారానికి వేదికవుతుంది. కర్ణాటక నిండు శాసన సభ లో రెండు రోజుల క్రితం ఎం.ఎల్.ఏ చేసిన భాగోతం వేడి ఇంకా చల్లారకముందే ఓ మంత్రి ప్రజాస్వామ్యం అపహాస్యం చేశాడు. ఒక ఎం.ఎల్.ఏ "ప్రభు"ద్దుడు చేసిన పనికే రాష్ట్ర నలుమూలలా చర్చ జరిగింది. ఇప్పుడు ఒక మంత్రి గారు పైగా ఆయన మంత్రి గారు మాత్రమే కాదు ఒక సుప్రసిద్ధ నటుడు కూడానూ....

అధికార పార్టీ కి చెందినా కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి, నటుడు అంబరీష్ శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న స్వపక్షానికి చెందిన ఎమ్మెల్యే మల్లికార్జునకు తను ఒక పబ్ లో అసభ్యకరమైన రీతిలో నాట్యం చేస్తూ ఉన్న ఒక చిత్రాన్ని ఆ ఎం.ఎల్.ఏ కు చూపిస్తూ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది...

ఈ సంఘటన తో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ప్రజలు తమ సమస్యల పట్ల చర్చించి అభివృద్ధి పథాన నడిపించమని ఓట్లు వేసి  ఆశీర్వదించి ఆసెంబ్లీ కి పంపిస్తుంటే ప్రజా ప్రతినిధులు చేసే నిర్వాకాలు ఇవి. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య చరిత్ర లో మాయని మచ్చలుగా మిగిలిపోతాయని పలు ప్రజా సంఘాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి దుస్సంఘటనలు ప్రజాస్వామ్య నైతిక విలువల మనుగడనే ప్రశ్నిస్తున్నాయన్న విషయాన్నీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు తెలుసుకుంటారో ....!!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : actor ambareesh  assembly  karnataka  congress government  

Other Articles