Nobel prize awardee malala special story

pakistan girl, malala, pakisthan, bharath nobel winnners, pakistan nobel award winners, nobel committee, sathyarthi, khailash sathyarthi, nobel prize award winner

presented nobel peace award for malala pakistan girl by nobel committe

మకుటం లేని మహారాణి "మలాలా"

Posted: 12/11/2014 08:10 PM IST
Nobel prize awardee malala special story

"మలాలా" ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. అవును నిజంగానే ఏ మకుటం లేని మంచి మనసున్న మహారాణి మలాలా. ఏ దేశంలో చూసిన ఈ అమ్మాయి పైనే చర్చ నడుస్తుంది ఏ అద్భుతం ఉంది మరి ఆ అమ్మాయిలో . అసలు ఆ అమ్మాయే ఒక అద్భుతం. మలాలా ని గుర్తు చేసుకోగానే ఒక అందమైన చిరునవ్వు నవ్వుతున్న మొహం కళ్ళ ముందు కదలాడుతుంది. నోబెల్ బహుమతి స్వీకరణ మహొత్సవానికి హాజరైన మలాలా అక్కడ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఆమె మాటలు మల్లెల తోటలై గుబాళించాయి. ఆమె పలుకులు వింటున్నపుడు అందరి హృదయాలు పులకరించిపోయాయి. ఆమె ప్రతి కదలిక ఈ కల్లోల ప్రపంచానికి శాంతి సందేశమవుతుంది.

ఆమె ప్రసన్న వదనాన్ని చూసి కొన్ని వ్యాఖ్యలు స్పూరణకు వచ్చాయి........ "ప్రశాంతతవై పరిడవిల్లుతావంటే ప్రపంచానికి పిలుపునవుతాను... హృల్లేఖ (చైతన్యం) హృదయంలో ఉదయమవుతాను ఆ ఉదయానికి ఊపిరవుతాను.. ఆ ఊపిరిలో కపోతంలా మారి శాంతి బావుటాకి చిహ్నంగా చరిత్ర లో నిలుస్తాను"......  

ఆ అమ్మాయి ఆలోచనల్లో అభ్యుదయం..మాటల్లో సూటితనం.. భావాల్లో బంగారు భవిష్యత్తు చూసి ప్రపంచ దేశాలన్నీ దాసోహమన్నాయి. . పట్టుమని పదిహేడేళ్ళు కూడా లేవు ఆమె ఇచ్చిన ప్రసంగం మంత్ర ముగ్దుల్ని చేసింది.  ఈ అవార్డ్ నాది మాత్రమే కాదు చదువుకోవాలనుకుంటోన్న చిన్నారులు.. భయానక పరిస్థితుల్లో ఉంటూ శాంతిని కోరుకుంటున్న చిన్నారులు.. మార్పును కోరుకుంటున్న చిన్నారులు.. వీరందరిదీ ఈ అవార్డు’ అని ప్రకటించటం ద్వారా ఆమె ఈ హింసతో కూడిన సమాజాన్ని ఎదురించటానికి స్థైర్యాన్ని ప్రసాదించే సైన్యంలా మారింది....

విద్య ఎంత  ముఖ్యమో మన నేతలు చెప్పాల్సిన అవసరంలేదు. చదువు విలువ వారికి తెలుసు. వారి పిల్లలు మంచి, మంచి పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ నేతలను కోరాల్సింది విద్యకు అత్యధిక ప్రాధాన్యనివ్వమని ఆమె అనటం ద్వారా ప్రపంచ నేతలకు పదిహేడేళ్ళ వయసులో పెను సవాలు విసిరింది.... చిన్నారుల హక్కుల కోసం, పసి మొగ్గల పలుకై ప్రసంగించి ప్రపంచమంతటికీ పనికొచ్చే సందేశం ఇచ్చింది . ‘ఇది వారిపై సానుభూతి చూపాల్సిన సమయం కాదు.  ఒక్క చిన్నారి కూడా విద్యకు దూరం కాని పరిస్థితిని నెలకొల్పాల్సిన సమయం ఇది..., ‘ఒక చిన్నారి, ఒక టీచర్, ఒక పెన్, ఒక పుస్తకం.. ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు అన్న మాటలు వినపడగానే కార్యక్రమంలో పాల్గొన్నవారే కాదు ఆ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కనులార వీక్షిస్తున్న ప్రేక్షకులు సైతం కరతాళధ్వనులతో కడు సంతోషాన్ని వెలిబుచ్చారు.

ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినపుడు ఆమె అధైర్య పడలేదు అంతకు రెట్టింపు ధైర్యంతో పోరాడింది. ఆమె ధైర్యాన్ని చూసిన తాలిబన్లు సైతం తలదించుకోక తప్పలేదు... ఆమె చిన్నారులకు విద్య కోసం పరితపిస్తున్న ఒక ఆవేదన.., ఆమెది అందరి కోసం ఆవేదనపడుతున్న ఒక అద్దం లాంటి మనసు... ఆమె మాట ఒక అద్భుతం.., ఆమె ఆలోచన ఒక ఆకాశం అసలు ఆమె అనంతం. అవును మరి ఆమె ఈ "అనంత అవని" అందించిన 'అద్భుతం'. ఈ పదిహేడేళ్ళ వయసులో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి అమ్మాయికి ఆప్యాయతతో తెలుగు విశేష్ అభినందన మందారమాలలు.....

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : malala  khailash sathyarthi  nobel committee  nobel peace award  

Other Articles