No maoists in telangana says home minister nayini narasimha reddy

maoists, telangana, home minister, nayini narasimha reddy, passing out parade, CISF SI 12Th batch, hakimpet

no maoists in telangana says home minister nayini narasimha reddy

ఆ రాష్ట్రంలో మావోయిస్టులే లేరట...

Posted: 12/04/2014 12:13 AM IST
No maoists in telangana says home minister nayini narasimha reddy

దేశ 29వ రాష్ట్రంగా అవిర్భవించిన నూతన  తెలంగాణ రాష్ట్రంలో అసలు మావోయిస్టులే లేరని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు ఏవీ తెలంగాణ రాష్ట్రంలో సాగడం లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో సీఐఎస్ఎఫ్ ఎస్ఐల 12వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పెరేడ్ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మావోల కార్యకలాపాలకు అస్కారమే లేదని వ్యాఖ్యానించారు. మావోయిస్టుల డిమాండ్ చేస్తున్న గిరిజన, హరిజనాభివృద్దికి ప్రభుత్వం దోహదపడుతుందన్నారు. మావోయిస్టులు కోరుకున్నదే తమ పార్టీ ఎన్నిక ల ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లిందని తెలిపారు. రాష్ట్రం అంతర్గతంగా ఎదుర్కోంటున్న సమస్యలను పరిస్కరించడంతో పాటు, పారిశ్రామిక అభివృద్ది పరోక్షంగా సీఐఎస్ఎఫ్ దళాలు దోహదపడుతున్నాయన్నారు.

తెలంగాణకు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడిచేసి 14 మంది జవాన్లను హతమార్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఏమైనా ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయనిలా చెప్పారు. భూమిలేని వాళ్లకు భూములు ఇవ్వడం, వృద్ధులకు, వికలాంగులకు పింఛను మొత్తాన్ని పెంచడం, చెరువుల పునరుద్ధరణ, రోడ్డు సౌకర్యాలను మెరుగుపరచడం లాంటి మావోయిస్టుల డిమాండ్లను తాము ఇప్పటికే అమలుచేస్తున్నామని, అందువల్ల వాళ్లకు ఇక్కడ ఎజెండా అంటూ ఏమీ లేదని నాయిని సూత్రీకరించారు. అయితే తెలంగాణ యువత కూడా ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం వేచి చేస్తున్నారే తప్ప.. మావోల బాట పట్టాలని యోచించడం లేదని నాయిని అన్నారు. ప్రజలు. మేధావులు, అన్ని వర్గాల వారు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత వచ్చిన తోలి ప్రభుత్వం తమదని అందుచేత ఎన్నికల హామీలన్నీ ఒక్కసారిగా అమలుపర్చలేమని, క్రమంగా అన్ని హామాలను తమ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరుస్తున్నారని నాయిని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles