France gives new year gift to riche indian tourists

Chalo paris, France, India, Mobile app, Visa, paris, visiting visa, tourist visa, business visa, eight visa centers

France gives new year gift to richee Indian tourists, gives visit visa in 48 hrs, plan your holiday on 'Chalo Paris' app

ఫారిస్ పోదాం.. పర్యటించి వద్దాం.. ఛలో ఛలో..

Posted: 11/28/2014 01:38 PM IST
France gives new year gift to riche indian tourists

భారతీయ వీదేశీ పర్యాటకులకు నెల రోజుల ముందుగానే ఫ్రాన్స్ ప్రభుత్వం కానుకను అందజేసింది. ఫ్రాన్స్ లో నూతన సంవత్సర వేడుకలు మొదలుకుని, పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలియ తిరిగి వచ్చేందుకు అసంఖ్యాక పర్యటకులకు అనుమతినిచ్చింది. అంతేకాదు పర్యటాక వీసాలను కేవలం 48 గంటల్లో అందించేందుకు సిద్దమని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎనమిది కేంద్రాల నుంచి భారత పర్యాలకులకు వీసాలను అందేజేసేందుకు సిద్దమైంది. ఫ్రాన్స్ దేశానికి పెరుగుతున్న భారత పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వున్న ఢిల్లీలోని దౌత్యకార్యాలయంతో పాటు పుద్దుచ్చరీ, కోల్ కత్తా, బెంగళూరు, ముంబాయి నగరాలలో వున్న ఫాన్స్ కేంద్రాల నుంచి డిసెంబర్ 1 నుంచి 48 గంటల్లో వీసా లభించనుంది. దీంతోపాటు కొత్తగా తెరవనున్న మరో ఎనమిది కేంద్రాల ద్వారా 78 గంటల్లో వీసా వచ్చి చేరుతుంది ఢిల్లీలోని దౌత్యకార్యాలయం వద్ద ఛలో పారిస్ మొబైల్ అప్లికేషన్ ను అవిష్కరించిన దౌత్యవేత్త ఫ్రాన్ కోయస్ రిచర్ ఈ ఆప్ తో పారిస్ పర్యటనకు వచ్చే పర్యాటకులు అక్కడి సమాచారం అందుబాటులో వుంటుందని తెలిపారు. అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ ప్రాంతాలు, నార్మండీ, లోర్ వ్యాలీ, మాంట్ సెయింట్ మైఖిల్, బార్ డియాక్స్ ప్రాంతాలతో పాటు అనేక వివరాలు యాప్ సాయంతో లభ్యమవుతాయని చెప్పారు.

భారత్ నుంచి కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పారిస్ పరిసర పర్యాటక ప్రాంతాను వీక్షించడానికి వస్తున్నారని తెలిపారు. అందుచేతే తాము ఇండియాలో పారిస్ ప్రమోషన్ పనులను చేపట్టినట్లు చెప్పారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత ధృడమైన బంధం ఏర్పర్చుకునే పనిలో భాగంగా నెలకోన్న అడ్డంకులను తోలగిస్తున్నామన్నారు. కొత్త ఏడాది నుంచి పర్యాటకంతో పాటు వ్యాపార వీసాలను కూడా కేవలం 48 గంటల్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటి వరకు పారిస్ ను సందర్శించిన పర్యాటకుల సంఖ్యలో 33 శాతం వృద్ది సాధించినట్లు ఫ్రాన్ కోయస్ రిచర్ తెలిపారు.

 ప్రతీ ఏడాది సగటున మూడున్నర లక్షల మంది భారతీయులు పారిస్ ను సందర్శించే వారిలో వున్నారని, అయితే ఇది పారిస్ ను సందర్శించే మొత్తం పర్యటకుల సంఖ్యతో పోల్చితే కేవలం 0.23 శాతంగా వుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ మాసాంతం వరకు 80 వేల మంది భారత పర్యాటకులు ప్రాన్స్ లో పర్యటించారని, మిగిలిన ఈ రెండు నెలల్లో ఆ సంఖ్య మరో పది వేలు పెరిగి 90 వేలకు చేరుకుంటుందని ఫ్రాస్స్ దౌత్యకార్యలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chalo paris  France  India  Mobile app  Visa  paris  visiting visa  tourist visa  business visa  eight visa centers  

Other Articles