South asia is slowly coming together says prime minister narendra modi

SAARC summit, Prime minister, narendra modi, Kathmandu, Nepal

south asia is slowly coming together says prime minister narendra modi

అవకాశఆలు అనేకం.. అందిపుచ్చుకుందాం..

Posted: 11/26/2014 04:02 PM IST
South asia is slowly coming together says prime minister narendra modi

సార్క్‌ దేశాలు పరస్పరం సహకరించుకుని అభివృద్ది బాటలో పురోగతి సాధించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాట్మండ్‌లో జరుగుతున్న 18వ సార్క్‌ శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగిస్తూ.. కేవలం భారత్‌ కోసమే కాదు దక్షిణాసియా భవిష్యత్‌ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. భారత్‌ అభివృద్ధితోనే దక్షిణాసియా అభివృద్ధి ముడిపడి ఉందన్న ఆయన సార్క్‌ దేశాలు ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
 
ఉగ్రవాదంపై సార్క్‌ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. దక్షిణాసియాలో శాంతికి భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముంబైపై దాడి ఘటనకు నేటికి ఆరేళ్లు పూర్తైనట్లు సదస్సులో తెలిపారు. మంచి పొరుగు దేశం ఉండాలని ఏ దేశమైనా ఆశిస్తుందని సార్క్‌ సదస్సులో పాకిస్తాన్‌పై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాల నుంచి సత్సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. దక్షిణాసియా దేశాల అభివృద్ధి ఓ సవాల్ గా తీసుకోవాలని మోడీ వ్యాఖ్యానించారు. సహకారం పెరిగితే అభివృద్ధి సులభం అవుతుందన్నారు. ప్రాంతీయ సహకారం అవసరం ఎంతైనా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.  

మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని దక్షిణాసియా దేశాలు ఐక్యంగా ముందుకు సాగి వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే  మరోవైపు చూడాల్సిన అవసరం రాదన్నారు. ప్రజలు ఆశించినంతగా మనం ముందుకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. యువతను మంచి దిశలో నడిపించాల్సి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యత అని మోదీ తెలిపారు. సార్క్ దేశాల మధ్య రోడ్లు, రైలు మార్గాలు అభివృద్ధి చేసుకోవాలని వెల్లడించారు. సార్క్‌దేశాలకు టీబీ, హెచ్‌ఐవీ వ్యాక్సిన్లు అందజేస్తామని, సార్క్‌ రోగులకు వైద్య వీసాలు కల్పిస్తామని మోదీ ప్రకటించారు. సార్క్‌ దేశాల కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించామని ఆయన పేర్కొన్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SAARC summit  Prime minister  narendra modi  Kathmandu  Nepal  

Other Articles