No talks with pakistan says ministry of external affairs

Narendra Modi, Prime Minister, India, pakistan, Nawaz Sharif, Syed Akbaruddin, MEA, SAARC

no plans for structured meeting between Narendra modi and pakistan prime minister Nawaz sharif says ministry of External affairs

పాకిస్థాన్ తో చర్చలు లేవు తేల్చిచెప్పిన భారత్

Posted: 11/26/2014 03:30 PM IST
No talks with pakistan says ministry of external affairs

భారత్ తో చర్చలు జరిపేందుకు తామ సిద్దంగా వున్నామని దాయాది పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రకటించిన మరుసటి రోజున పాకిస్థాన్ తో చర్చలు లేవని భారత్ విదేశాంగ శాఖ తే్ల్చిచెప్పింది. సార్క్ దేశాల సదస్సులో భాగంగా ఖట్మండులో భారత్ సహా పాకిస్థాన్ ప్రధాని చేరుకోవడంతో ఇరు దేశాల మధ్య సదస్సు ముగిసిన తరువాత చర్చలు జరుగుతాయన్నవార్తలు వచ్చాయి. అయితే ఖట్మండులో ప్రధాని నరేంద్రమోడీ నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం ఎలాంటి చర్చలు లేవని విదేశాంగ శాఖ స్పస్టం చేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేటీ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ నేపాల్ రాజధాని కాట్మాండ్లో స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల మధ్య భేటీకి ఇప్పటి వరకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. 18వ సార్క్ సమావేశాలు కాట్మాండ్లో ప్రారంభమైన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి పాకిస్థాన్ తో చర్చల విషయం ప్రధాని షెడ్యూల్ లో లేదని చెప్పారు.

దీంతో భారత్, పాక్ నేతలు ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించే అవకాశం ఉందా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సయ్యద్ అక్బరుద్దీన్ లేదని తేల్చిచెప్పారు. ఇటీవల కాలంలో భారత్పై పాకిస్థాన్ తరచుగా కాల్పులకు తెగబడుతు గతంలో ఇరుదేశాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి.. కాల్పులను పూర్తిగా విరమించిన తరువాత పాకిస్థాన్ తో చర్చలు జరుపుతామని ఇదివరకే భారత్ స్పస్టం చేసింది. కాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్షరీష్ భారత్ అంగీకరిస్తే చర్చలకు సిద్దమన్న నేపథ్యంలో ఇరుదేశాల ప్రధానులు సార్క్ సమావేశాలలో భాగంగా భేటీ అవుతారన్న వార్తలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Prime Minister  India  pakistan  Nawaz Sharif  Syed Akbaruddin  MEA  SAARC  

Other Articles