Telangana government eye on open lands to raise income by increasing tax

open land, income, telangana government, Tax, increase, open plots

telangana government eye on open lands to raise income by increasing tax

ఆదాయం పెంపుకు నయా ప్లాన్.. ఖాళీ స్థలాలపై పన్ను భారం

Posted: 11/26/2014 11:03 AM IST
Telangana government eye on open lands to raise income by increasing tax

తెలంగాణ ఆదాయం లేని రాష్ట్రం కాదు, ఆదాయాన్నికొల్లగొట్టుకున్న రాష్ట్రం అని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే పనిలో భాగంగా కసరత్తు ప్రారంభించారు. న్యాయస్థానాల్లో నానుతున్న కేసులన్నీ పరిష్కారమైతే వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయని గతంలో ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. తాజాగా రాష్ర్టంలోని ఖాళీ స్థలాలపైనా కన్నేసి వాటిపై కూడా పన్నును భారీగా పెంచే యోచనలో ఉంది. అంతేకాదు క్రమం తప్పకుండా ఇకపై వసూలు చేయనుంది.

నగరంలో శివార్లలో ప్లాట్లు కోనుగోలు చేసి.. వాటికి మంచి ధరలు వచ్చనిప్పుకు విక్రయించి పిల్లల పెళ్లిళ్లు చేద్దామని, లేదా రిటైర్మంట్ తరువాత ఇళ్లు కట్టుకుని సెటిల్ అవుదావమని అనుకునే వాళ్లకు ఆశాలపై తెలంగాణ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. వారు కోని ఖాళీగా వుంచిన స్థలాలు, ప్లాట్లపై ఇక పన్నుతో భాధేందుకు సిద్దమైంది.. ఇలాంటి స్థలాలపై ఇప్పటివరకు వున్న నామమాత్రంగా పన్నులు భారీగా పెరగనున్నాయి. వసూలు చేస్తుంది. సాధారణంగా ఎవరూ వీటికి పన్ను చెల్లించరు. అధికారులు కూడా అంతగా వత్తిడి చేయరు. భవన నిర్మాణాల అనుమతులకు వెళ్లినప్పుడు మాత్రం ఒకవేళ పన్ను చెల్లించకుండా ఉంటే స్థలం కొన్న తేదీనుంచి లెక్కేసి నామమాత్రంగా వసూలు చేస్తారు. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. రాష్ర్టంలోని 60 శాతం మున్సిపాలిటీలు నష్టాల్లో ఉన్నాయన్న పేరుతో ఇకపై ఖాళీ స్థలాలపై వసూలు చేస్తున్న పన్నును పెంచాలని, అదికూడా క్రమం తప్పకుండా రాబట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పురపాలకశాఖ కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీల వారీగా ఖాళీ స్థలాలు గుర్తించడంతో పాటు ప్రస్తుతం వాటిపై ఎంత పన్ను వస్తోంది, పన్ను ఏ మేరకు పెంచితే ఆదాయం పెరుగుతుంది ఇతరత్రా అంశాలను పరిశీలిస్తోంది. చాలా మున్సిపాలిటీలో భారీగా ఖాళీ స్థలాలు ఉన్నాయి.

అయితే ముఖ్యంగా కార్పొరేషన్ల పరిధిలో ఎక్కువగా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్లలో భూమి రిజిస్ట్రేషన్ విలువపై 0.5 శాతం మేరకు పన్నుగా వసూలు చేస్తున్నారు. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 2 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు.. ఇలా వాటి స్థాయిని బట్టి ఖాళీ స్థలాలకు పన్నులు పెంచాలని చూస్తున్నారు. పురపాలక శాఖ ఇటీవలి ఎన్నో సమీక్షా సమావేశాల్లో నష్టాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో పన్నులు నామమాత్రంగానైనా పెంచాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ స్థలాల యజమానులందరికీ త్వరలోనే పన్ను సంబంధిత నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : open land  income  telangana government  Tax  increase  open plots  

Other Articles